ఇక టీవీ రంగంలో ఇపుడు ఒక పెద్ద రియాలిటీ షో అంటూ బాగా పాపులర్ అయంది బిగ్ బాస్ షో. ఏ బాషాలో యినా కూడా బాగా వివాదంలో ఉంది ఈ రియాలిటీ షో.  ఏదో ఒక వివాదం లేకపోతే బిగ్ బాస్ కాన్సెప్టులు ప్రజలు ఎవరు చూస్తారు?  ఏవో సిల్లీ గేమ్స్ ఆడించేస్తూ అన్ని గంటల పాటు ఈ రియాలిటీ షోకే అంకితమవ్వమని చెప్పేంత సాహసం చేస్తారా ఎవైరైన? ఏదో ఇంకేదో స్పైసీ జూసెస్ ని ఆస్వాధించాలని ఆరాటపడే ఆడియెన్ మహాప్రభువుల్ని సంతుష్టుల్ని చేసేందుకు ఏదో ఒకటి చేయాలి కదా. 


ఆ ఏదో ఏది? అంటే.. సల్మాన్ హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13లో జరుగుతుంది. అది ఏమిటి అంటే.. బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్ అన్నదే ఈ టాస్క్ యొక్క థీమ్. దీని ప్రకారం అమ్మాయి- అబ్బాయి ఒకే బెడ్ పై పడుకుని స్నేహితుల్లా అంతకుమించి కలిసిపోవచ్చు. ఇలాంటిది ఏదో ఒకటి లేకపోతే ఇంకేం ఉంటుంది? అని అందరికీ అనిపిస్తోందా? అయితే ఈ రసరమ్య కలాపాల వేదికగా మారిన బిగ్ బాస్ -హిందీ సీజన్ 13 ఆద్యంతం వివాదాల హోరు పీక్స్ కి పోయింది అంటే నమ్మండి .


 ఈ దెబ్బకు ఏకంగా సల్మాన్ ఇంటి ముందు  ధర్నాలు - రాస్తారోకోలు అంటూ  సామాజిక సంఘాలు బరి స్థాయిలోదిగాయి. మొదటగా సల్మాన్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. రాజకీయ నాయకులు కూడా.. ఈ వివాదంపై మద్దతు పలుకుతుండడంతో హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్ బాగా  వేడెక్కిస్తోంది. పిచ్చి పరాకాష్టకు చేరుతున్న బిగ్ బాస్ భారతీయ సంప్రదాయాలను భగ్నం చేస్తుందని వీరంతా బాగా మండి పడ్డారు.


 సల్మాన్ ఇంటి పరిసరాల్లో ఆందోళనలు మరింత ఉద్రిక్తతం అవ్వడంతో పదిమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి ఈ నిర్ణయంపై బిగ్ బాస్ వెనక్కి తగ్గుతాడా లేదా అన్నది చూడాలి మరి. ఇలాంటి షోకి హోస్టింగ్ చేస్తున్నందుకు సల్మాన్ గిల్టీ ఫీల్ అవుతున్నాడా ? లేదా? అన్నది చూడాలి ఇక . ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 సైతం కాస్టింగ్ కౌచ్ వివాదంతో రచ్చయిన సంగతి అందరికి  తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: