ఫేస్ బుక్ తో సమానంగా సామాజిక మాధ్యమంలో తన సత్తా చూపిస్తోంది వాట్స్ యాప్. ఉదయం లేచిన దగ్గర నుంచీ దాదాపు దీనిమీదనే ఆఫీస్ పని దగ్గర నుంచ పర్సనల్ పనుల వరకూ అన్నీ కానిచ్చుకునే జనాలు ఎందఱో ఉంటారు. ఇప్పటి వరకూ లేని కొత్త ఫీచర్ ని వాట్స్ యాప్ మొదలు పెట్టింది. వాట్స్ యాప్ యూజర్ల కోసం కొత్త వెర్షన్ లో " గిఫ్ " లని అంగీకరించింది. చిన్న చిన్న మూడు నాలుగు సెకన్ల వీడియో లు - ధ్వని లేని వాటిని గిఫ్ లు అంటారు. ఈ ఫార్మాట్ ఇప్పటి వరకూ వాట్స్ యాప్ లో లేనే లేదు. ఈ సౌలభ్యాన్ని సులభతరం చేస్తూ కొత్త అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ ని పంపే డేటా తో మాత్రమే వీటిని పంపెసుకోవచ్చు. గిఫ్ కోసం ప్రత్యేకంగా ఎక్కువ డేటా అయిపోతుంది ఏమో అనే భయం కూడా ఉండదు. ఆరు - ఐదు సెకన్ల వీడియో లు ఇందులో వెళతాయి అది కూడా తక్కువ డేటా తో. ఆరు సెకన్ల కంటే ఎక్కువ గనక నిడివి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండనే ఉంది. వాట్స్ యాప్ బీటా వెర్షన్ 2.16.242 లో ఈ గిఫ్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సదుపాయం కోసం గూగుల్ ప్లే స్టోర్ లో బీటా వర్షన్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ యూజర్ లకి మాత్రమే ఇది పనిచేస్తుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: