ప్రస్తుతం ఎక్కడ విన్నా మోస్ట్ పాపులర్ గేమ్ ఏముంది అంటే వినిపించే ఏకైక పదం PUBG. ఈ గేమ్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ గేమ్ ఆడేవాళ్ళకేమో గాని వాళ్ళని చూసే సన్నిహితులకి మాత్రం పిచ్చేక్కడ ఖాయం అనడంలో సందేహం లేదు. ఈ గేమ్ పిల్లలపై, పెద్దలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది అంటూ ఇప్పటికే పలు దేశాలు ఈ గేమ్ ని నిషేధించాయి. అయితే

 

మిగిలిన దేశాల్లో కూడా ఈ గేమ్ బ్యాన్ చేయాలంటూ ఎంతో మంది కోర్టులలో పిటిషన్ కూడా వేస్తున్నారు. Tik Tok.. ని నిషేధించాలి అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి నిరసనలు అయితే వచ్చాయో అందరికి తెలిసిందే ఇండియాలో కూడా తాజాగా ఈ Tik Tok.. పై నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 

ఇదిలాఉంటే నేపాల్ లో తాజాగా PUBG గేమ్ విషయంలో అక్కడి కోర్టులు విధించిన బ్యాన్ ని సవాలు చేసిన వారికి మద్దతుగా నిలిచింది సుప్రీంకోర్టు. అసలు ఎందుకు ఈ గేమ్ నిషేధించాలి అంటూ ఎదురు ప్రశ్నించి అందుకు తగ్గ నివేదిక ఇవ్వాలని అంతవరకూ నిషేధాన్ని ఎత్తేస్తున్నట్టుగా తీర్పు చెప్పింది. దాంతో ఇండియాలో PUBG గేమ్ విషయంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనని ఈ గేమ్ ఆడే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అయితే పిల్లల తల్లి తండ్రులు మాత్రం Tik Tok ని బ్యాన్ చేసినట్టుగా  PUBG గేమ్ కూడా బ్యాన్ చేయాలని పట్టుపడుతున్నారట. మరి ఈ గేమ్ విషయంలో ఎలాంటి తీర్పు ఇండియాలో వస్తుందో వేచి చూడాలి.

 

 

 

 

 

 

 

 

 

­­­


మరింత సమాచారం తెలుసుకోండి: