వేసవి అంటేనే మనకి గుర్తొచ్చేవి పుచ్చకాయలు, ఇవి వేసవి కాలంలో దాహాన్ని తీర్చడమే కాక, ఆరోగ్య సమస్యలకు కూడా దివ్యమైన ఔషదంలా పనిచేస్తుంది , పుచ్చకాయలలో వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి, సి లతో పాటు శరీర పనితీరుకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, అయోడిన్‌లు ఎక్కువగా ఉన్నాయి.






అంతేకాదు వీటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయ గింజల్ని పొడి కొట్టి ఆ పొడిని నీటిలో మరిగించి చల్లారాక తాగితే కిడ్నీలో రాళ్లు మటుమాయం అవుతాయని చెప్తున్నారు. ఇంకా పుచ్చకాయ అడుగున ఉండే తెల్లనైన పదార్ధం చర్మానికి చాలా మేలు చేస్తుందని దాంతో చర్మాన్ని రుద్దితే చెమటల వల్ల ఏర్పడే ఫంగల్ ఇన్‌ ఫెక్షన్లు తగ్గుతాయని చెప్తున్నారు నిపుణులు. అలాంటిది వీటికంటూ ఒక స్పెషల్ డే ఉందని, ప్రతి సంవత్సరం ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవంగా జరుపుకుంటారని ఎంతమందికి తెలుసు.






స్పెషల్ గా అమెరికాలో ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ స్పెషల్ డేని ఎవరు కనిపెట్టారో ఇప్పటికీ తెలియదు కాని, కొందరు దీనిని పుచ్చకాయ రైతులు ప్రారంభించారని, మరికొందరు నేషనల్ వాటర్ మిలన్ కౌన్సిల్ సృష్టించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట పుచ్చకాయలను దక్షిణాఫ్రికాలో ఎక్కువగా పండించేవారని, దాదాపు వెయ్యి సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి పుచ్చకాయ పంట ఆసియా అంతటా వ్యాపించిందని చెప్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: