సోషల్ మాధ్యమంలో ఫేస్ బుక్ కంటే కూడా దూసుకుపోతున్న వాట్సప్ , తమ వినియోగదారుల కోసం నిత్యం కొత్త కొత్తగా ముస్తాబు అవుతోంది. మారుతున్నటెక్నాలజీకి అనుగుణంగా, ఎంతో కలర్ ఫుల్ గా అధినాతన పరిజ్ఞానం తో వాట్సప్ లో మార్పులు చేర్పులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వినియోగదారులు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ వారి కోరికల మేరకు కూడా వాట్సప్ మార్పులు చేపడుతోంది.

 

ఈ క్రమంలోనే వాట్సప్ వెబ్ లో కూడా స్టిక్కర్స్, ఆల్బమ్స్ వంటి ఫీచర్స్ తీసుకువస్తోంది.అంతేకాదు మరింత కలర్ ఫుల్ గా ముస్తాబు కాబోతోంది. దాంతో యూజర్స్ తమకి నచ్చినట్టుగా ధీమ్స్, మార్చుకోవచ్చు. ఇదిలాఉంటే ఇప్పటికే వాట్సప్ లో తమకి నచ్చినట్టుగా ధీమ్స్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ ని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు నేరుగా వాట్సప్ గనుకా ధీమ్స్ సమకూర్చగలిగితే మరో యాప్స్ సాయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

 

అయితే ఆ ధీమ్స్ ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి అనేది మాత్రం క్లారిటీ లేకపోయినా తప్పకుండా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వాట్సప్ తన వినియోగ దారుల కోసం డార్క్ మోడ్ ఫీచర్ ని సైతం ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తులు చేస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: