ఫేస్‌బుక్ అబ్బో ఇది లేకుండా వుండలేకపోతున్నాం అనేవారు ఎందరోవున్నారు.లవర్స్ ఐతే పబ్లిక్‌లో కలవకున్నా సీక్రెట్‌గా మస్తు మస్తుగా చాటింగ్‌లు చేసుకుంటున్నారు. కాలేజీలో గాని ఇంట్లో గాని ఎవరి కంట్లో పడకుండా చాటుమాటు గుసగుసలు ఫేస్‌బుక్‌లో చాలానే చేస్తున్నారు.ఇక ఫేస్‌బుక్‌లో చాటింగ్‌తో పాటు డేటింగ్ చేసుకోవచ్చు అంటున్నారు,ప్రతినిధులు.అందుకోసం సరికొత్త యాప్‌ను సృష్టించారట,ఈ మాట వినగానే ఉడుకు రక్తం ఉరకలేస్తుందేమో ఇంకా ఆసక్తిగ్గా ఫేస్‌బుక్ ను పరిశోధించడం మొదలు పెట్టారు యూత్ అమ్మాయిలకోసం డేటింగ్ చేయడానికని.ఇక మరికొందరైతే గోడచాటు ప్రేమలకు సరికొత్త చిరునామా దొరికిందని తెగ సంతోషిస్తున్నారు.ఇక ఈ సంబరానికి తెరలేపిన ఆ యాప్ వివరాలు కనుగొందాం.



సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.మరో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.దీని పేరు సీక్రెట్ క్రష్ అంటే రహస్య ప్రేమ అని అర్ధం.ఇక ఇప్పటికే అనేక ఫీచర్లతో మనిషి లైఫ్ స్టైల్ ను మార్చేసిన ఫేస్‌బుక్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకు రావడంతో ఇది ఎన్ని సంచనాలకు మూలబిందువు అవుతుందోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ సీక్రెట్ క్రష్ ఫ్లాట్ ఫామ్ పై యూజర్లు తమ ఇష్టాయిష్టాలను నిర్భయంగా పంచుకోవచ్చు.వారి మిత్రుల మిత్రులను కూడా పరిచయం చేయవచ్చు.ఈ యాప్‌లో ఫేస్ బుక్ యూజర్లతో పాటు ఇన్ స్టాగ్రామ్ యూజర్లను-ఇన్ స్టాగ్రామ్ ఫొటోలను కూడా అనుసంధానించవచ్చట. అయితే.ఇక్కడ ఫేస్‌బుక్ కంటే ముందే టిండర్ అనే వెబ్‌సైట్,డేటింగ్ కు వేదికగా నిలిచింది.అందుకని ఫేస్‌బుక్ ఇప్పుడు టిండర్ కు పోటీగా ఈ సీక్రెట్ క్రష్ ఫీచర్ ను తీసుకొచ్చింది.



అయితే ఇతర డేటింగ్ సైట్లలాగా కనెక్ట్ కావడానికి ఒకరికి ఒకరు పరిచయం వుండవలసిన అవసరం లేదు,నచ్చిన వారి ప్రొఫైల్,ఫొటోపై కామెంట్ చేస్తే చాలు ఈ సీక్రెట్ క్రష్ తో కనెక్ట్ కావొచ్చు.ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవ్యక్తి,తొమ్మిది మంది ఫేస్‌బుక్ లేదా ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు కనెక్ట్ కావచ్చు.వారే కాకుండా వారి ఫ్రెండ్స్,ఫ్రెండ్స్, ప్రొఫైల్స్‌ను కూడా షేర్ చేసుకుని,హాయిగా మాట్లాడుకోవచ్చు.ఒకవేళ ఎదుటి వారు నచ్చకుంటే వెంటనే ఇంటూ మార్క్ ను క్లిక్ చేస్తే చాలు.ఇక డేటింగ్ చేయాలనుకుంటున్న వారి జాబితాను కూడా ఇందులో ‘సీక్రెట్’గా దాచుకోవచ్చు.మరి ఇప్పుడు ఈ సీక్రెట్ క్రష్ మనిషి లైఫ్ స్టైల్ లో ఎన్ని మార్పులకు దారి తీస్తుందో వేచిచూడాలి.ఆ అన్నట్లు మరిచా ఈ ఫీచర్ కేవలం అమెరికా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది..అప్‌సెట్ అయ్యారా త్వరలో ఇండియాకు కూడ వస్తుంది కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే..

మరింత సమాచారం తెలుసుకోండి: