వన్ ప్లస్ వన్ మొబైల్ గురించి తెలియని వారు ఉండరు. మొబైల్ పై అవగాహన ఉన్నవారు, స్మార్ట్ ఫోన్ లని అమితంగా ఇష్టపడే వారికి ఈ మొబైల్ కొనుగోలు చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఈ మొబైల్ ఎంతో స్టైలిష్ గా, అద్భుతమైన డిజైన్ తో ఎంతో ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ మొబైల్ కెమెరా పని తీరు మరే మొబైల్ కెమెరా కూడా పోటీ పడలేనంతగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే

 

తాజాగా One Plus one మొబైల్ తయారి దారు స్మార్ట్ టీవీ లాంచ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ టీవీకి సంభందించిన రిమోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిమోట్ ఇలా ఉంటే ఇక టీవీ ఎలా ఉంటుందో అంటూ ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. వన్ ప్లస్ టీవీ రిమోట్ లో USB - C పోర్ట్ , రెగ్యులర్ ఆండ్రాయిడ్ నేవిగేషన్ బటన్స్ , గూగుల్ అసిస్టెంట్ బటన్ , వన్ ప్లస్ హోం బటన్ వంటి ఫీచర్స్ చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి.

 

ఇప్పటి వరకూ వచ్చిన టీవీ రిమోట్స్ లో ఇది అత్యంత ఆధునాతన టెక్నాలజీ తో రూపొందిందని అంటున్నారు టెక్ నిపుణులు. కేవలం ఒక్క బొటనవేలు తో రిమోట్ మొత్తాన్ని కంట్రోల్ చేసే విధంగా ఇది రూపొందించబడి ఉందట. ఇక One Plus one నుంచీ రాబోతున్న టీవీ 55 అంగుళాల  స్క్రీన్ తో రాబోతోందట. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ టీవీలో మొత్తం 8 స్పెకర్లు ఉన్నాయట. ఇప్పటికే మొబైల్ రంగంలో సంచలనం సృష్టించిన One Plus one, స్మార్ట్ టీవీల విషయంలో ఎలాంటి మార్పు తీసుకువస్తుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: