జియో ఫైబర్  బ్రాడ్ బ్యాండ్ దెబ్బకి అన్ని ఫైబర్ నెట్ వర్క్స్ దిగోస్తున్నాయి. ప్రస్తుతం ఫైబర్ నెట్ వర్క్ లో సంచలనాలు సృష్టించడానికి దూసుకు పోతున్న జియో ఫైబర్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మార్కెట్ లో ఉన్న అన్ని ఫైబర్ నెట్ వర్క్స్ కంటే కూడా జియో దాదాపు 40 శాతం తక్కువకే తనసేవాలని అందిస్తోంది. రూ. 699 ప్లాన్ తో 100 Mbps స్పీడు అందిస్తోంది. దాంతో యూజర్స్ అందరూ జియో వైపు ఆశగా చూస్తున్నారు.

 

జియో ఫైబర్ సేవల ధరలు ఒకసారి పరిశీలిస్తే. రూ. 699 ప్లాన్ తో 100 Mbps స్పీడు అత్యధికంగా రూ. 8 వేల మొత్తంతో 1GBPS స్పీడు అందిస్తోంది. అయితే జియో ఫైబర్ సేవలు పొందాలంటే ఇన్స్టలేషన్ రుసుము చెల్లించాలి. ముందు 2500 చెల్లించాలి. ఇందులో సెక్యూరిటీ డిపాజిట్ గా 1500 తీసుకోగా 1000 రూపాయలు ఇన్స్టలేషన్ చార్జెస్ గా తీసుకుంటారు.  అయితే ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాలలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

 

అయితే జియో ఫైబర్ సేవలు పొందాలంటే ఎలా రిజిస్టర్ అవ్వాలంటే..

జియో ఫైబర్ book now లింక్ పై  క్లిక్ చేయండి. ఇందులో రెండు మెనూలు కనిపిస్తాయి అందులో ఒకటి upgrade  మరొకటి new connection. ఇంతకుముందే మీరు రివ్యూ కస్టమర్ అయితే  upgrade  ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త కనెక్షన్ తీసుకునేవారు గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయాలి. ఎంటర్ యువర్ అడ్రస్ ఫర్ జియో ఫైబర్ అని ఓ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది

అందులో హోమ్ అడ్రస్ లేదా అ వర్క్ అడ్రస్ అనే రెండు ఉంటాయి. హోమ్ అడ్రస్ అయితే మీ పూర్తి పేరు కాంటాక్ట్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఒకవేళ వర్క్ అడ్రస్ అయితే మీ కంపెనీ పూర్తి పేరు కాంటాక్ట్ నెంబర్ ఆర్ కంపెనీ ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి ఆ తరువాత సెలెక్ట్ యువర్ ప్లాన్ అనే ఆప్షన్ దగ్గర మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు

దీంట్లో మొత్తం ఆరు డేటా ప్లాన్ లు ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరిస్తూ డిఫాల్ట్ టిక్ మార్క్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయిన తరువాత జనరేట్ అనే బటన్పై క్లిక్ చేయాలి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ సరి చూసుకున్న తర్వాత మీకు జియో ఫైబర్ కనెక్షన్ రిజిస్టర్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది అయితే మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ పరిధిలో సర్వీస్ ప్రొవైడర్ ఉంటే తప్పకుండా మీకు సేవలను అందిస్తారు. లేకపోతే  తరువాత మీ అభ్యర్థనను పరిశీలించి ఆ ప్రాంతంలో సేవలు అందుబాటులోకి వస్తే తప్పకుండా మీకు జియో ఫైబర్ సేవలు అందిస్తారు. మీతో ఈ విషయాలని తెలియచేయడానికి జియో ఫైబర్  కస్టమర్ కేర్ ప్రతినిధులు మీతో మాట్లాడుతారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: