టెలికం రంగంలో దూసుకువెళ్తున్న జియో కి మిగిలిన పోటీ నెట్వర్క్ లు ధీటుగా సమాధానం ఇవ్వాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా BSNL ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. జియో కి ధీటుగా ఉండటానికి అనేక కొత్త డేటా ప్లాన్స్ ని ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక్క రోజుకి 33GB డేటా అందిస్తూ సంచలన ప్రకటన చేసింది.

 

BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ రూ. 1999 ని తాజాగా విడుదల చేసింది. భారత ఫైబర్ లలో ఒక ప్లాన్ గా ఉంటుంది. ఈ ప్లాన్ లో 100mbps వేగం అందుకుంటుంది. అంతేకాదు ప్రతీ రోజు  33GB డేటా తో హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు. అయితే ఒక్క రోజులు మీరు 33gb డేటాని పూర్తిగా వాడినట్లయితే 100mbps నుంచీ ఈ స్పీడు 4mbps కి తగ్గించబడుతుందని ప్రకటించింది.

 

ఈ ప్లాన్ లో లోకల్ మరియు జాతీయంగా అపరిమిత కాల్స్ ని అందిస్తున్నట్లుగా సంస్థ తెలిపింది. అయితే రోజు వారి పరిమితి దాటినా తరువాత ఒక్క సారిగా 4mbps కి స్పీడు తగ్గిపోవడం అనేది జియో కి అడ్వాంటేజ్ అవుతుందనేది టెక్ నిపుణుల అభిప్రాయం. మరి ఈ ప్లాన్ BSNL కి ఏ మేరకు లాభం తెచ్చి పెడుతుందో, జియో తో పోటీ పడగలదో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: