పండగ సీజన్ వచ్చేస్తోంది కాబట్టి ఈ కామర్స్ దిగ్గజాల మధ్య పోటీ పెరిగిపోయే సమయం ఇది. ఈ పండగలో ఎవరి బిజినెస్ ఎక్కువగా ఉంటుందని అనేది వారు పెట్టే ఆకర్షణీయమైన ఆఫర్ల పై, ఆధారపడి ఉంటుంది. అయితే Flipkart మాత్రం ప్రతీ వినియోగదారుడు తమ వద్ద ఒక్క వస్తువు అయినా కొనాలనే కాన్సెప్ట్ తో తాజాగా Flipkart pay later ని ముందుకు తీసుకువచ్చింది. ఈ విధానంతో వినియోగ దారులని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

 

 

పండగ ఆఫర్ లో మనకి కావాల్సిన లేదా నచ్చిన వస్తువులు అందుబాటులో ఉంటాయి. కానీ మధ్య తరగతి వినియోగ దారులు మాత్రం పండగ ఖర్చులకే రకరకాలుగా ఆలోచనలు చేస్తుంటారు. మరి భారీ ఆఫర్లతో ప్రకటనలు చేస్తున్న ఈ కామర్స్ వైపు ఎలా వెళ్తారు. అందుకే Flipkart అలాంటి వారికోసం Flipkart pay later ని ప్రకటించింది. ఈ విధానం వలన మనకి నచ్చిన వస్తువుని మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే సొంతం చేసుకోవచ్చు.

 

Flipkart  బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఆఫర్ ఎంతోమందికి ఉపయోగపడుతుందని Flipkart భావిస్తోంది.

ఈ సరికొత్త విధానం వలన డబ్బులు లేకపోయినా సరే 5 వేల వరకూ షాపింగ్ చేయవచ్చు. ఆ సొమ్ముని అదే రోజు మొదలు 40 రోజుల్లోగా చెల్లించాలి ఎలాంటి చార్జెస్  ఉండవు . ఒక వేళ 40 రోజులు దాటితే తప్పకుండా చార్జీలు వర్తిస్తాయని సంస్థ తెలిపింది. ఇక కార్డ్ లెస్ క్రెడిట్ అయితే లక్ష రూపాయల వరకూ కొనుగోలు చేయవచ్చు అయితే ఇది నెలవారీ EMI రూపంలో సంవత్సర కాల పరిమితితో చెల్లించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: