షావోమి కంపెనీ ఈ వారం నాలుగు కొత్త MI టీవీలను మార్కెట్లోకి ప్రారంభించింది. అయితే ఇంతకుముందు విడుదలైన ఎంఐ టీవీలు ఎంత పెద్ద సక్సెస్ అయినా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ సపోర్ట్ లేవని కొందరు వీటిపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ విమర్శలకు చెక్ పెట్టడానికి ఐదు పాత ఎంఐ టీవీలకు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు సపోర్ట్ చేసే అప్ డేట్ తో పాటు బోనస్ గా.. ఆండ్రాయిడ్ 9.0 అప్ డేట్ ను కూడా అందించనున్నారు. ఈ విషయాన్ని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ వెల్లడించారు.దసరా సేల్ సందర్భంగా సెప్టెంబర్ 29న ఎంఐ టీవీల సేల్ మొదలవుతుంది.

32 అంగుళాల స్క్రీన్ సైజ్ కల ఎంఐ టీవీ 4ఏ ప్రో, 43 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ప్రో, 49 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ప్రో, 32 అంగుళాల ఎంఐ టీవీ 4సీ ప్రో, 55 అంగుళాల ఎంఐ టీవీ 4 ప్రోలకు ఈ అప్ డేట్లు రానున్నట్లు జైన్ తెలిపారు. మరి మిగతా మోడళ్లకు ఈ అప్ డేట్లు వస్తాయో రావో ఆయన పేర్కొనలేదు. కానీ ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వస్తాయని తెలిపారు కాబట్టి డిసెంబర్ లోపు వస్తాయని అనుకోవచ్చు. అలాగే వీటికి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేదు. కానీ అధికారిక ప్రకటన వచ్చింది, అతి త్వరలోనే అప్ డేట్లు వస్తాయని ఆశించవచ్చు.

అయితే ఎంఐ తాజాగా లాంచ్ చేసిన 43 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్, 50 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్, 65 అంగుళాల ఎంఐ టీవీ 4ఎక్స్, 40 అంగుళాల ఎంఐ టీవీలకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 9.0 అప్ డేట్లతోనే రానున్నాయి. కాబట్టి వాటిని ప్రత్యేకంగా అప్ డేట్ చేయనక్కర్లేదు. ఈ కొత్త టీవీలకు సంబంధించిన రిమోట్లలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లకు ప్రత్యేకంగా ఒక బటన్ కేటాయించనున్నారు. మరి ఇప్పుడు అప్ డేట్ చేయనున్న టీవీలకు మళ్లీ ప్రత్యేకంగా రిమోట్లు విడుదల చేస్తారో, లేక ఉన్నవాటితోనే సర్దుకోవాలో చూడాలి మరి!షావోమి తాజాగా విడుదల చేసిన టీవీల్లో డేటా సేవర్ అనే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ ఆప్షన్ ఆన్ చేస్తే సాధారణంగా చూసే దాని కంటే మూడు రెట్లు ఎక్కువ కంటెంట్ చూసుకోవచ్చు. ఈ టీవీల్లో సాధారణ ప్యాచ్ వాల్ కాకుండా అప్ గ్రేడ్ అయిన ప్యాచ్ వాల్ 2.0 ఆపరేటింగ్ సిస్టం  ఉంటుంది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో లైవ్ న్యూస్ ఇంటిగ్రేషన్ అనే ఫీచర్ ద్వారా న్యూస్ చానెళ్ల అవసరం లేకుండానే బ్రేకింగ్ న్యూస్ కూడా అందించే విదంగా చేశారు. ఈ ప్యాచ్ వాల్ 2.0 మరిన్ని ఓటీటీ యాప్స్ ను కూడా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: