ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలలో  వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వివో వీ17 ప్రో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే. డ్యూయల్ పాపప్ సెల్ఫీ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది.ఈ స్మార్ట్ ఫోన్  మెమరీ విషయానికి వస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉండనుంది.మరి ధర విషయానికి వస్తే  రూ.29,990గా నిర్ణయించబడింది.ఈ స్మార్ట్ ఫోన్  కలర్ విషయానికి వస్తే మిడ్ నైట్ ఓషన్, గ్లేసియర్ కలర్లో  అందుబాటులో ఉంది.మరి వివో V17 ప్రో ఫోన్ ని ఈ-షాప్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్, పేటీయం మాల్, టాటా క్లిక్ వెబ్ సైట్లలో కొనవచ్చు అని తెలిపింది.

హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 10 శాతం అదనపు క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, వన్ టైం స్క్రీన్ రీప్లేస్ మెంట్ వంటి లాంచ్ ఆఫర్లు కూడా అందించనున్నారు.వివో V17 ప్రో ఫోన్   6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా ఫుల్ వ్యూ సూపర్ అమోలెడ్(AMOLED) డిస్ ప్లే  ఉంది.

ఇక ప్రోసెర్స్ విషయానికి వస్తే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్ను ఉపయోగించారు.  ఈ ఫోన్లో ముఖ్య విశ్యానికి వస్తే  వెనకబాగాన నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంటుంది. సోనీ ఐఎంఎక్స్582 సెన్సార్ ను ఉపయోగించారు.

దీని అపెర్చర్ f/2.5. 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూ కలిగిన 8 మెగా పిక్సెల్ కెమెరాను వైడ్ యాంగిల్ లెన్స్ గా ఉపయోగించారు. దీని అపెర్చర్ f/2.2గా ఉంది. మరో 2 మెగాపిక్సెల్ కెమెరాను బొకే ఎఫెక్ట్ కోసం ఉపయోగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: