గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజన్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ ని ఆకట్టుకోవడానికి సరికొత్తగా ముస్తాబయ్యి వస్తూ ఉంటుంది. తాజా క్రోమ్ కొన్ని లేటెస్ట్ ఫీచర్స్ నో అప్డేట్ చేసుకుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లోని అడ్రస్ బార్ లో ఏదన్నా ప్రశ్న టైపు చేసినపుడు వెంటనే అక్కడే సమాధానం ఇచ్చే అవకాశం కల్పించింది. మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ప్రత్యేకించి సెర్చ్ చేసి వెతకాల్సి న పని లేదు.

 

మీ ఫోన్ లోని గూగుల్ క్రోమ్ వెబ్ పేజీని ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. షేర్ బటన్ క్లిక్ చేయగానే అది నేరుగా వాట్సప్ , ఫేస్ బుక్ లకి కూడా వెళ్ళిపోయే విధంగా ఆప్షన్ ఉంచారు. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ లో క్రోమ్ వాడే వారి ట్యాబ్ లు అన్నీ ఓ క్రమ పద్దతిలో ఉండటానికి , అవసరం అనుకున్న ట్యాబ్ లోకి సులభంగా వెళ్ళడానికి ట్యాబ్ గ్రిడ్ లేఅవుట్ ని ప్రవేశపెట్టారు.

 

అంతేకాదు గూగుల్ క్రోమ్ లో ఇప్పుడు మీకు నచ్చిన థీమ్స్ మార్చుకోవచ్చు. నచ్చిన రంగు ఎంచుకోవచ్చు. ఎక్కువ ట్యాబ్ లు ఓపెన్ చేసి పెట్టినపుడు అన్నిటిని వెతుక్కునే పని లేకుండా మౌస్ ఏ ట్యాబ్ పై పెడితే ఆ వెబ్సైటు పేరు తెలిసేలా అద్భుతమైన ఫీచర్స్ ప్రవేశపెట్టారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: