చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌.. మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది.  సెప్టెంబర్ 26 న  ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వన్‌ప్లస్ 7 టీ  పేరుతో ప్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను  భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.  ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభించనుంది.  128  జీటీ స్టోరేజ్‌ ధర రూ. 37,999,  256 జీబీ  స్టోరేజ్‌  వేరియంట్‌ ధర రూ. 39,999 గా నిర్ణ‌యించారు.  సెప్టెంబరు 28నుంచి వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌, అమెజాన్‌.ఇన్‌, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లలో ఈ ఫోన్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది.


ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. వన్‌ప్లస్‌ 7టీ 6.55 అంగుళాల ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ వాటర్‌డ్రాప్‌ నాచ్‌ డిస్‌ప్లేతో లభించనుంది.  ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ను, 8జీబీ ర్యామ్ 48,  3,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు 12 ఎంపీ టెలీఫొటో లెన్స్‌తో ల‌భిస్తుంది. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండనుంది. మెరుగైన చార్జర్‌ వల్ల వన్‌ప్లస్‌ 7ప్రోతో పోలిస్తే కొత్త ఫోన్‌ 18 శాతం వేగంగాచార్జ్‌ అవుతుందని కంపెనీ వెల్ల‌డించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: