ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వాడకం అధికమవుతోంది. ఒకప్పుడు ఒంటరిగా ఉంటే చెప్పలేని చిరాకుతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. అందుకే నలుగురితో కలిసి ఉండాలి అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితిని స్మార్ట్ ఫోన్ భర్తీ చేసేసింది. ఇప్పుడు నేను ఒంటరి అయినా పర్లేదు నాకు స్మార్ట్ ఫోన్ ఉందిగా అనే వారు రోజు రోజుకి అధికమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు, అర్ధ రాత్రి వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇదే అది పెద్ద ప్రమాదంగా మారుతుంటే చాలా మంది ఇప్పుడు మరొక ప్రమాదం అంచున నిలబడ్డారట.

 

స్మార్ట్ ఫోన్ వాడకంలో సారీ పిచ్చిలో పడి చివరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకువెళ్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారట. అయితే తాజగా పరిశోధన ప్రకారం ఇలా ఫోన్ బాత్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళే వాళ్లకి మూత్ర సంభందిత వ్యాధులు వస్తున్నాయట. టాయిలెట్ బేసిన్, లేదా సింక్ లపై ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుందని, టాయిలెట్ కి వెళ్ళిన క్రమంలో ఆ బేసిన్లు ముట్టుకున్న చేతులతోనే మొబైల్ ఫోన్ ముట్టుకోవడం వలన ఆ బ్యాక్టీరియా ఫోన్ లోకి చేరుతోందని ఈ క్రమంలోనే ఫోన్ నుంచీ మనకి ఆ బ్యాక్టీరియా చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని లండన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త తెలిపారు.

 

అంతేకాదు మొబైల్ ఫోన్ టాయిలెట్ లోకి తీసుకుని వెళ్ళడం వలన తప్పకునా పైల్స్ బారిన పడుతారని హెచ్చరించారు. స్మార్ట్ ఫోన్ లో ముచ్చట్ల లోపడి పోయి కొన్ని కోట్ల మంది బాత్ రూమ్ లో అలానే కూర్చుని ఉండిపోతున్నారని దీనివల్ల పైల్స్ వచ్చే ఘంటికలు తీవ్రంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు చూసైనా స్మార్ట్ ఫోన్ బాత్ రూమ్స్ లోకి తీసుకువెళ్ళడం ఆపితే చాలా మంచిదని ప్రకటించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: