శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్ న్యూస్‌. ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ తో ముందుకు రానుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా  శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురాబోతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే సరసమైన ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశ పెట్టనున్న‌ట్టు తెలుస్తోంది.


గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్‌లో గెలాక్సీ ఎ 91 మాదిరిగానే 45వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ , స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌, ట్రిపుల్‌ రియర్‌  కెమెరాను అమర్చినట్టు తాజా లీకుల ద్వారా తెలుస్తోంది. జీఎస్‌ఎం ఎరేనా  రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్  ఫీచర్లు ఈ విధంగా  ఉండనున్నాయి. 


ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. 6.7 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855, 8 జీబీ ర్యామ్ , 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 48 ఎంపి మెయిన్ కెమెరా +12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ +  5 ఎంపీ డెప్త్ సెన్సార్, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండ‌నున్న‌ట్టు అంచ‌నా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: