మీకో విషయం తెలుసా ? ఐడీ కార్డు లేకుండా ప్రయాణిస్తే టికెట్ లేని ప్రయాణంగా పరిగణిస్తుంది రైల్వే.మీ బెర్త్ ఐన సరే ఇతర ప్రయాణికులు కూర్చోవడానికి అంగీకరించాలి.ఇవ్వక్కడి రూల్ మేమెప్పుడూ వినలేదే అనుకుంటున్నారా? మరదే ట్విస్టు......టికెట్ బుక్ చేశామా .... రైలెక్కి బజ్జున్నామా కాదు.... కాస్త    టికెట్ బుకింగ్ చేసుకునేప్పుడు  బుకింగ్ రూల్స్ తెలుసుకోండి.


మీరు తరచూ రైలు టికెట్లు బుక్ చేస్తుంటారా? మీకు ఇండియన్ రైల్వేస్ టికెట్ బుకింగ్ రూల్స్ తెలుసా? నియమనిబంధనలన్నీ తెలిస్తే టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండొచ్చు. ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ప్లాట్‌ఫామ్‌ ద్వారానే రైలు టికెట్ ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసే సమయంలో కొన్ని నియమాలు, గైడ్‌లైన్స్ గుర్తుంచుకోవాలి. రైల్వే రిజర్వేషన్ ఆఫీసులు, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా రైలు టికెట్లను బుక్ చేయాలి.
అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 120 రోజులు ఉంటుంది. అంటే రైలు బయల్దేరడానికి 120 రోజుల ముందే మీరు రైలు టికెట్లను బుక్ చేయొచ్చు.


కొన్ని ఇంటర్‌సిటీ రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 120 రోజుల కన్నా తక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 6 రైలు టికెట్లను బుక్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేస్తే గరిష్టంగా 12 టికెట్లు బుక్ చేయొచ్చు. ఒకసారి ట్రైన్ ఎక్కాక ఒక వ్యక్తికి బెర్త్ అలాట్ చేస్తే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే పడుకోవడానికి అనుమతి ఉంటుంది. అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇతర ప్రయాణికులు కూర్చోవడానికి అంగీకరించాలి.బెర్త్‌ల అలాట్‌మెంట్ కంప్యూటర్ ద్వారా జరుగుతుంది.



రైళ్లల్లో ప్రయాణించే వ్యక్తులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే ఐడీ కార్డును తీసుకెళ్లాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఐడీ కార్డ్, స్టూడెంట్ ఐడీ కార్డ్, ఫోటోతో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్, ఫోటోతో ఉన్న క్రెడిట్ కార్డ్ ఐడీ ప్రూఫ్‌గా చూపించొచ్చు.ఐడీ కార్డు లేకుండా ప్రయాణిస్తే టికెట్ లేని ప్రయాణంగా పరిగణిస్తుంది రైల్వే. మరి ఇవన్నీ తెలుసుకొని మీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోండి. తెలుసుకోకుండా ట్రైన్ ఎక్కడ తోటి ప్రయాణికులతో తగాదా పడితే మీకే నష్టం.  



మరింత సమాచారం తెలుసుకోండి: