సాంకేతిక పరిజ్ఞానము ఈ రోజులలో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. సాంకేతిక సహాయంతో సమస్యాత్మక ప్రాంతాల్లోనూ భద్రత చర్యలు సులువుగా చేపట్టవచ్చు. ఇంకా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విమానాశ్రయాల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సులభతరం అవుతున్నది. తాజాగా, ఈ అంశంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి తెచ్చారు. 


ఈ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యింది. ఫేస్ రికగ్నైజేషన్ మిషన్ తొలిదశలో సిబ్బంది తనిఖీకి వినియోగించారు. ఇది విజయవంతం కావడంతో ప్రయాణికులకు జూలై 1 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిని జులై 31 వరకు పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహించారు.మొత్తము 180 మంది ప్రయాణికులు స్వచ్ఛందంగా ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లో నమోదు చేసుకున్నారు. 


త్వరలో అన్ని దేశీయ విమాన సర్వీసులకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో 4198 మంది డొమెస్టిక్ ప్రయాణికుల ముఖకవళికలు నమోదు చేశారు. లక్ష్యానికి నుంచి 40 శాతం ఎక్కువ మంది రిజిస్ట్రేషను చేశారు. వీరిలో సినీనటులు, రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి ముఖకవళికలు నమోదు చేసుకున్న ప్రయాణికులు ఆ తర్వాత ఎప్పుడు విమానములో ప్రయాణించిన కూడా వారికి ఎలాంటి తనిఖీలు లేకుండా వారు తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించేందుకు వీలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.


ప్రస్తుతము 4198 మంది ప్రయాణికులు అధికముగా తమ ముఖ కవళికలను నమోదు చేసుకున్నట్లు జిఎంఆర్ అధికారులు తెలిపారు. హైదరాబాదు నుంచి ఢిల్లీకి రెగ్యులర్గా రాకపోకలు సాగించే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, సినిమా యాక్టర్లు, సైతం తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రయాణికులు వివరాలు నమోదు చేయించుకొనుట కు ఎయిర్పోర్టులోనే ఒకటి ,మూడు డొమెస్టిక్ డిపార్చర్ గేట్ల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర విమానయాన శాఖ పరిశీలనకు పంపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: