ఈ రోజులలో మానవుడు చెయ్యలేని పని ఏదీ లేదు అన్నట్లు పరిశోధనలు జరుగుచున్నవి. కొత్త కొత్త టెక్నాలజీని కనిపెట్టు చున్నారు. అంతరిక్ష పరిశోధనలో ముఖ్యముగా చంద్ర గ్రహం పై మానవాళి మనుగడ సాధ్యమా? కాదా? అనే కోణంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ( ఇస్రో) సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి నుంచే పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కలిగించేందుకు చెన్నైలో రామనాథపురం ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమము ఈ నెలలో జరిగింది.


సమావేశంలో  మాట్లాడుతూ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించడంలో భారతదేశము ముందంజలో ఉందన్నారు. అంతరిక్ష పరిశోధనలు విస్తృతంగా చేసే దిశగా ఇస్రో పని చేస్తున్నదని, చంద్రుడిపై పరిశోధన లను విస్తృత ము చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. చంద్ర గ్రహం పాటు అంగారక గ్రహం పై కూడా మానవాళి జీవించేందుకు అనుకూల వాతావరణం ఉందా? లేదా? అని గుర్తించేందుకు ఇస్రో నిర్ణయించింది. రాకెట్ల ద్వారా వ్యోమగాములు అక్కడికి పంపి పరిశోధనలను విస్తృత ము చేయుచున్నాము అని తెలిపారు.


చంద్రగ్రహం కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ లోతైన పరిశోధనలు చేయుటకు ప్రారంభించినది. అక్కడి పైభాగంలో ఉన్న బిలాలు ఉల్కల తాకిడికి సంబంధించిన గుర్తులతో పాటు ఏర్పడే గోతులఫోటోలను ఆర్బి టర్ లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ అందించింది.ఇది చంద్రుడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులు అధ్యయనం చేయుటకు ఉపకరిస్తాయి అని ఇస్రో బుధవారం వెల్లడించింది. చంద్రయా న్ టు లోని విక్రమ్ లాండర్ జాడను గుర్తించేందుకు నాసా తాజాగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అని నాసా శాస్త్రవేత్త జాన్ కెల్లర్ తెలిపారు.


చంద్రయాన్-2 ను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జి.ఎస్. ఎల్ ఏ ఎం కె 3 వాహనం ద్వారా ప్రయోగించారు. చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ ఉండే ఆర్బిటర్, దాని నుంచి విడివడి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే ల్యాండర్. ల్యాండర్ నుంచి బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై నడిచే ఈ మూడు చంద్ర యాన్ 2 యొక్క భాగాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: