ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రపంచంలో బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా మంది తప్పనిసరిగా గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడుతుంటారు. ఇంకా తెలియని ప్రదేశాలకి వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు మనకు. ప్రస్తుత నేపథ్యంలో కొన్ని సార్లు మనం వెళ్లిన ప్రదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా, లేదా అప్పటికే మొబైల్ డేటా అయిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ ఆఫ్ లైన్ లో పూర్తిగా డౌన్ లోడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. 


మనము ఎక్కడికైనా బయటకి వెళ్లాలనుకున్నప్పుడు ఆ ప్రదేశానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ ముందే డౌన్ లోడ్ చేసుకుని వెళ్లడం మంచిది. గూగుల్ మ్యాప్స్ ముందే ఆఫ్ లైన్ లో  డౌన్ లోడ్ చేసుకోవాలంటే మొట్ట మొదట మీ ఇంటి దగ్గర వైఫై కనెక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే డౌన్ లోడ్ కి ప్రయత్నించండి. దీనికి కారణం మీరు ఎంపిక చేసుకునే ప్రదేశాన్ని బట్టి 100 ఎంబీ మొదలుకుని 300 ఎంబీ వరకూ మొబైల్ డేటా ఖర్చు అవుతుంది. అలాగే మీ మొబైల్ లో ఇంటర్నల్ స్టోరేజ్ లో తగినంత స్పేస్ ఉండే విధంగా కూడా చూడాలి. మీకు ఏ ప్రదేశానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ కావాలి అది ఆ ప్రదేశం వద్ద రెడ్ కలర్ మార్కర్ చేసుకొని, ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ లో మెనూ లోకి వెళితే ఆఫ్ లైన్ మ్యాప్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని "సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్" అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఆఫ్ లైన్ లో లభించే విధంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.


మ్యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు అది ఎంత పరిమాణం ఉన్నదో అన్నది ఫోన్ స్క్రీన్ మీద చూపించబడుతుంది. మీరు జూమవుట్  చేసుకుంటూ వెళ్లే కొద్దీ మరింత ఎక్కువ పరిమాణం సెలెక్ట్ అయ్యి, ఆటో మేటిక్ గా డౌన్ లోడ్ చేయాల్సిన మ్యాప్ పరిమాణం బాగా ఎక్కువుగా పెరిగి పోతుంది. కాబట్టి మీకు ఎంత వరకు కావాలో అవసరం అయినంతవరకే   మాత్రమే సెలక్ట్ చేసుకోవడం మంచిది.


ఇక ముందు మీరు ఆ ప్రదేశానికి నేరుగా వెళ్లినప్పుడు అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినప్పటికీ ఇప్పటికే మీ ఫోన్లో డౌన్లోడ్ అయి ఉన్న మ్యాప్స్ ఆధారంగా మీకు నావిగేషన్ చూపించ బడుతుంది. అయితే నిర్దిష్టమైన కాలం తర్వాత ఇలా డౌన్లోడ్ చేయబడిన మ్యాప్స్ ఆటోమేటిక్ గా తొలగించబడతాయి. కాబట్టి మీరు గతంలో డౌన్ లోడ్ చేసుకున్న మ్యాప్స్ అయినా అదే ప్రదేశానికి వెళ్లబోయే ముందు ఒక సారి చెక్ చేసుకుని, అప్పటికే డిలీట్ అయి ఉంటే మళ్లీ డౌన్ లోడ్ చేసుకోవడం మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: