ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాగ్నిజెంట్.. ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ రాబోయే త్రైమాసికాల్లో 7వేల ఉద్యోగాలకు కోత పెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇది కఠినతరమైన నిర్ణయమే అయినప్పటికే ప్రస్తుతం నెలకొన్న తప్పని పరిస్థితుల్లో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది.


కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి కాగ్నిజెంట్ వైదొలుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందిఆ తర్వాత జరిగే పునర్‌వ్యవస్థీకరణ ప్రభావం మరో 6,000 మంది ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉంది.
అయితే.. కంపెనీ నుంచి తొలగించాలని భావిస్తున్న 5000 మందిని మళ్లీ తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.తాజాగా కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి తప్పుకోవడంతో.. దాని ఎఫెక్ట్ సంస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ హంఫ్రిస్ పేర్కొన్నారు.


 వారికి కొత్తగా మళ్లీ శిక్షణ ఇచ్చి.. ఇతర స్థాయి ఉద్యోగాల్లో నియమించే అవకాశం ఉంది. అంటే.. మొత్తం మీద దాదాపు 7000 మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కూడా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూజెర్సీలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో పోస్ట్-ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

దాదాపు 10వేల నుంచి 12వేల మంది సీనియర్ ఉద్యోగులను తొలగిస్తామని.. అందులో 5వేల మందికి కొత్త టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇప్పించి తిరిగి వేరే పోస్టుల్లో భర్తీ చేయనుంది. దీంతో 5వేల నుంచి 7వేల ఉద్యోగాలకు కోత పడనుంది. కంపెనీ ఉద్యోగాల్లో ఇది 2శాతం కింద లెక్క. కంటెంట్ మోడరేషన్ బిజినెస్ మూసివేస్తే కంపెనీ కమ్యూనికేషన్ వ్యవస్థ, మీడియా, టెక్నాలజీ శాఖలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రక్రియ మొత్తం రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని కాగ్నిజెంట్ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: