ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రియులందరూ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న యాపిల్ టీవీ+ రంగానికి సిద్ధం అయంది. స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్ధ యాపిల్ ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ను ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో ఒకేసారి అందుబాటులోకి రాబోతుంది. యాపిల్ టీవీ+ ధర కూడా తక్కువగానే  నిర్ణయించడం జరిగింది. నెలకు రూ.99 చెల్లిస్తే చాలు. సెప్టెంబర్ 10 తర్వాత ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్ టచ్, యాపిల్ టీవీ, మ్యాక్ బుక్ లను కొనుగోలు చేసిన వారికి ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ను ఒక సంవత్సరం వారు ఉచితంగా ఇవ్వబోతున్నారు.


అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ వంటి ఇతర ప్రధాన స్ట్రీమింగ్ సర్వీసులకు, యాపిల్ టీవీ+కు ఉన్న ప్రధాన తేడా ఏంటంటే.. ఇందులో కేవలం యాపిల్ నిర్మించిన ఒరిజినల్ కంటెంట్ ను మాత్రమే వినియోగదారుల ముందుకు తీసుకుని రాబోతున్నారు. అందుకే కాబోలు ఇందులో లాంచ్ సమయంలో అందించిన షోలు కూడా తక్కువగా ఉండడం గమనార్హం. లాంచ్ అయిన వెంటనే మీరు దీన్ని ఓపెన్ చేస్తే.. మీకు కనీసం పది షోలు కూడా చూడలేరు.


ఇక ఎవరైనా ఒక స్ట్రీమింగ్ సర్వీస్ ను ఎంచుకోవాలని అనుకునేటప్పుడు ముందుగా గుర్తు వచ్చేది ధర ఎంత అని. అది మన బడ్జెట్ లో ఉందా? లేదా? అని ముందుగా చూసుకుని, బడ్జెట్ సరే  అనుకుంటేనే కంటెంట్ దాకా పోతారు ఎవరైనా. ఇక్కడే యాపిల్ మిగతా ప్రధాన స్ట్రీమింగ్ సర్వీసులకు భారీ దెబ్బ తగిలింది. నెలవారీ సబ్ స్క్రిప్షన్ విషయంలో మార్కెట్లో ఉన్న ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులు అయిన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ల కంటే తక్కువ మొత్తాన్ని నిర్ణయించడం జరిగింది.


ఇక అమెజాన్ ప్రైమ్ నెలవారీ సబ్ స్క్రిప్షన్ రూ.129 కాగా, నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ రూ.199గానూ, హాట్ స్టార్ నెలవారీ సబ్ స్క్రిప్షన్ రూ.299 వరుకు కట్టవలసి ఉంది. అయితే వార్షిక సబ్ స్క్రిప్షన్ మాత్రం మిగతా సర్వీసుల మాదిరిగానే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్ స్క్రిప్షన్ రూ.999గా ఉండగా, హాట్ స్టార్ ధర కూడా అంతే ఉంది. యాపిల్ టీవీ+ సబ్ స్క్రిప్షన్ ను కూడా అంతే మొత్తంగా నిర్ణయించడం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: