టిక్ టాక్.. ఈ యాప్ కి ఎంతమంది బానిసలూ అయ్యారో అందరికి తెలిసిందే. ఈ టిక్ టాక్ యాప్ కి పల్లెల్లో ఉండే వారి నుంచి సెలబ్రెటీల వరుకు అందరూ బానిసలూ అయ్యారు. మొన్నటి వరుకు అనుపమ పరమేశ్వరన్ టిక్ టాక్ కి బానిస అయితే.. ఇప్పుడు రాసి ఖన్నా బానిస అయ్యింది. 


ఈ బానిసత్వం గురించి పక్కన పెడితే.. ఈ టిక్ టాక్ కొన్ని వేలమంది ప్రాణాలను హరించుకుపోయింది. అందులో అవుతే సెలబ్రెటీ అవుతారు లేకపోతే ప్రాణాలు కొలిపోతారు. అంత పిచ్చి ఎక్కించింది ఈ టిక్ టాక్. ఇలా టిక్ టాక్ చేస్తూ చాలామంది ప్రాణాలను విడిచారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే కొన్ని వేలమంది ప్రాణాలు వదిలారు. 


దీంతో గత మే నెలలో ఈ టిక్ టాక్ యాప్ ని బ్యాన్ కూడా చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళి ఈ యాప్ యాక్టీవ్టే అయ్యింది. అయితే ఈ యాప్ ఇప్పుడు మరో అడుగు ముందు వెయ్యడానికి టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ ని త్వరలో లాంచ్ చేయనుంది. ఆ టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అన్ని ఇప్పటికే విడుదల అయ్యాయి. 


అయితే టిక్‌టాక్ క్రియేటర్ బైట్ డ్యాన్స్ కంపెనీ స్మార్టిజన్ జియాంగో ప్రొ3 పేరుతో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో విడుదల కానుంది. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చి పడింది. త్వరలో ఈ విడుదల అయ్యే ఈ టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ లో తప్ప మారే టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ లో ఈ టిక్ టాక్ యాప్ పని చేయదట.. 


టిక్ టాక్ యాప్ కోసమైనా సరే ఈ టిక్ టాక్ పిచ్చోళ్ళు ఫోన్ కొంటారు అని ఆలా ప్లాన్ చేశారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి ఇది ఎంతమాత్రం నిజం అనేది టిక్ టాక్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయితే కానీ తెలియదు.     



మరింత సమాచారం తెలుసుకోండి: