వరుసగా వాట్సప్ గుడ్ న్యూస్‌లు చెబుతోంది. వెంటవెంటనే అప్డేట్ చేసి కొత్తకొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తోంది వాట్సాప్. కొద్దిరోజుల క్రితమే ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ రిలీజ్ చేసింది వాట్సప్. వెంటనే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు రోల్ అవుట్ చేస్తోంది. 


ఈ ఫీచర్ వచ్చిందంటే... ఇక మీకు వాట్సప్ గ్రూప్స్ సమస్యే ఉండదు. అంటే మిమ్మల్ని ఎవరు గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. మిమ్మల్ని ఎవరు గ్రూప్స్‌లో యాడ్ చేయకూడదో మీరే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. వాట్సప్‌లో మీరు గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేశాకా.. టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్ ను క్లిక్ చేయండి. దాంట్లో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయండి. ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్‌లో ప్రైవసీ క్లిక్ చేసి తదుపరి ప్రైవసీలో గ్రూప్స్ క్లిక్ చేశాక మీరు 'Everyone' సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా గ్రూప్స్‌లో యాడ్ చేయొచ్చు. 'My contacts' సెలెక్ట్ చేస్తే కేవలం మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారే గ్రూప్స్‌లో యాడ్ చేసే అవకాశం ఉంటుంది. 'My contacts except' అని సెలెక్ట్ చేస్తే ఎవరు మిమ్మల్ని గ్రూప్స్‌లో యాడ్ చేయొద్దో వారి కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. 


అదే మీరు 'Nobody' అని సెలెక్ట్ చేశారంటే.. మిమ్మల్ని ఎవరూ గ్రూప్స్‌లో యాడ్ చేయలేరు. ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది వాట్సప్. గతంలో ఈ ఫీచర్ కేవలం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేదని, టెస్టింగ్ తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేస్తోందని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: