దేశీయ టెలికం రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన వొడాఫోన్ భారీ నష్టాలను నమోదు చేసుకున్నది. వాస్త‌వానికి టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు తిరుగులేకుండా.. మూడేళ్లలోపే  మొబైల్‌ కనెక్షన్ల పరంగా దేశంలో అగ్రస్థానాన్నికైవశం చేసుకుంది. ఒక్కప్పుడు వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌ కలిసి ఉండడంతో దేశంలో టాప్ లో ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేద‌నే చెప్పారు. అయితే భారత్‌ మార్కెట్లలో అవాంఛిత పోటీలవల్ల వొడాఫోన్‌ కంపెనీకి 1.1 బిలియన్‌ డాలర్ల నష్టం వస్తోందని అంచనావేసింది. 


దీనితో కంపెనీ వొడాఫోన్‌ ఐడియాలో ఉన్న 45శాతం వాటాలో కూడా నష్టం చవిచూస్తోంది. మాతృసంస్థ ఇప్పటికే గడచిన మూడేళ్లుగా భారత్‌ బిజినెస్‌పై నష్టాలు తెచ్చుకుంటున్నది. అర్ధక సంవత్సర ఫలితాల్లోనే 600 మిలియన్‌ యూరోలు అంటే 662 మిలియన్‌ డాలర్లు నష్టపోతోంది. మే నెలలో 1.6 బిలియన్‌ డాలర్ల యూరోల నష్టంనుంచి మరింతపెరిగిందని విశ్లేషకులు చెపుతున్నారు. 


బిజినెస్‌ సంక్షోభం మరింతపెరుగుతూ 300 మిలియన్‌ చందాదారులతో వొడాఫోన్‌ గ్లోబల్‌చందాదారుల్లోనే మూడింట రెండొంతులున్న భారత్‌ కస్టమర్‌బేస్‌ ఇపుడు క్షీణిస్తోంది. వొడాఫోన్‌ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నిక్‌రీడ్‌ వాటాదారులకు ఇప్టఇకే డివిడెండ్‌ను తగ్గించాలని నిర్ణయించిన‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: