ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ఫేస్‌బుక్‌ డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్ప‌టికే న‌గ‌దు చెల్లింపుల్లో గూగుల్ పేతో పాటు ఫోన్ పే లాంటి యాప్‌లు ఖ‌చ్చితంగా ప‌ని చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఫేస్‌బుక్ కొద్ది రోజులుగా వాట్సాప్ పే ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టింంచింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఫేస్ బుక్ పే లాంచ్ అయ్యింది. ఫేస్‌బుక్‌ లో ఫేస్‌బుక్‌ పే పేరుతో అమెరికాలో లాంచ్‌ చేసింది. ఫేస్‌బుక్‌ సొంతమైన వాట్సాప్‌, మెసెంజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీల సౌలభ్యాన్ని త్వరలోనే వినియోగదారులకు అందించనుంది.


మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో పనిచేసే కొత్త చెల్లింపుల వ్యవస్థను త్వరలోనే తీసుకు రానున్నారు. ఈ ఫేస్‌బుక్ పే దాదాపు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేపాల్‌ ద్వారా చెల్లింపులను చేసుకోచ్చు. ఈవెంట్ టిక్కెట్లు, ఇతర కొనుగోళ్లతోపాటు, వ్యక్తుల మధ్య నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. ఫేస్ బుక్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని సెట్టింగ్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ఆపై "ఫేస్‌బుక్ పే" కు వెళ్లి, చెల్లింపు పద్ధతిని జోడించి లావాదేవీ పూర్తి చేయవచ్చు.


అలాగే వినియోగ‌దారులు డ‌బ్బు పంపేట‌ప్పుడు లేదా చెల్లించేట‌ప్పుడు సెక్యూరిటీ సిస్ట‌మ్ కూడా ఉంది. పిన్ నెంబర్, టచ్ లేదా ఫేస్ ఐడి గుర్తింపు లాంటి బయోమెట్రిక్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కాగా భారతదేశంలో, ఫేస్బుక్ వాట్సాప్ పే, పీర్-టు-పీర్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇటీవల ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: