ప్రస్తుతం భారతదేశంలో టెలికాం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటోంది. ఏజీఆర్ ప్రభావంతో ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 50,921 కోట్ల రూపాయల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా ప్రకటన చేసింది. గతంలో ఏ కంపెనీ కూడా భారత్ లో ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు. గతంలో కోట్ల రూపాయల లాభాలు సంపాదించిన టెలికాం కంపెనీలు జియో రాకతో నష్టాల బాట పట్టాయి. 
 
జియో రాకతో మిగతా టెలికాం కంపెనీలు ఫ్రీ కాల్స్, తక్కువ ధరకే డేటా ఇవ్వాల్సి వచ్చింది. తక్కువ ధరకే డేటా, ఫ్రీ కాల్స్ ఇవ్వటం వలన నెట్ వర్క్ కంపెనీల ఆదాయాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు కాల్ ఛార్జీల వలన కోట్ల రూపాయలు సంపాదించిన కంపెనీలు జియో రాకతో ఆ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయాయి. డేటాకు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ డేటా ఛార్జీలు కూడా గతంతో పోలిస్తే చాలా తగ్గాయి. 
 
ఫ్రీ కాల్స్, తక్కువ ధరకే డేటా అందిస్తూ ఉండటంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు  74 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అందువలన టెలికాం శాఖ కొత్త నియమ నిబంధనలు రూపొందించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకనుండి ఏ నెట్ వర్క్ కు కాల్ చేస్తున్నారు..? ఏ నెట్ వర్క్ వాడుతున్నారనేది సంబంధం లేకుండా కాల్ ఛార్జీలు, డేటా ఛార్జీలు వాడకానికి తగిన విధంగా  చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 
 
ఫ్రీ కాల్స్, తక్కువ ధరకే డేటా వలన టెలికాం కంపెనీల ఆదాయం తగ్గిపోవటంతో టెలికాం శాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త విధివిధానాలు అమలులోకి వస్తే అన్ని నెట్ వర్క్ సంస్థలు ఇవే నిబంధనలు పాటిస్తాయి. వినియోగదారులు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రచారం జరుగుతూ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: