మనం సాధారణంగా వాడే హెల్మెట్ వందల్లో ఉంటుంది. మరీ ప్రీమియం హెల్మెట్ కావాలంటే దాని ధర మహా అయితే వేలల్లో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హెల్మెట్ ధర తో రెండు లగ్జరీ కార్లు కొనొచ్చు అవును ఈ హెల్మెట్ ధర అక్షరాలా రూ 2.8 కోట్లు. అయితే ఇది సాధారణ హెల్మెట్ కాదు. అమెరికా యుద్ధవిమానం లో ఉపయోగించే ఎఫ్‌-35 హెల్మెట్ ధర ఇది.
 
యుద్ధవిమాన హెల్మెట్‌ ఖరీదు 4,00,000 అమెరికన్‌ డాలర్లు ఇండియన్ కరెన్సీ లో అక్షరాలా రూ 2.8 కోట్లు. యుద్ధ విమానంలో ఉన్న పైలట్ల ఏకాగ్రత దెబ్బతినకుండా సౌండ్‌ప్రూఫ్‌గా దీనిని నిర్మించారు. ఇది శబ్దాలను గణనీయంగా తగ్గించేస్తుంది. దీనిలో స్పేషియల్‌ ఆడియో టెక్నాలజీని వినియోగించారు. దీంతో పైలెట్లకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో స్పష్టమైన అవగాహన లభిస్తుంది. సాధారణంగా చీకటిపడితే పైలట్లు ప్రత్యేకమైన నైట్‌ విజన్‌ గాగుల్స్‌ ధరించాల్సి ఉంటుంది. కానీ, ఈ హెల్మెట్‌ వినియోగించే పైలట్‌కు ఆ అవసరం లేదు. దీనికి ఎక్స్‌రే విజన్‌ సౌకర్యాన్ని కల్పించారు. దీంతోపాటు థర్మల్‌ విజన్‌ ఎఫెక్ట్‌ కూడా పైలట్లకు లభిస్తుంది. 


పైలట్లు తమ టార్గెట్ ని గుర్తించేందుకు గతంలో కాక్‌పీట్‌లో అటు ఇటు చూడాల్సి వచ్చేది. కానీ, ఈ ఎఫ్-35  హెల్మెట్‌లో పైలట్‌కు టార్గెట్ కి సంబంధించిన సమాచారం నిరంతరం అందుతూ ఉంటుంది. దీంతో పైలట్‌ ఏకాగ్రత దెబ్బతినదు. ఈ హెల్మెట్‌కు ఫార్వర్డు లుకింగ్‌ ఇన్ఫ్రారెడ్‌ కెమెరాలు, సెర్చ్‌, ట్రాకింగ్‌ రాడార్‌ను కూడా అమర్చారు. హెల్మెట్‌ స్క్రీన్‌పై పిక్చర్‌ ఆన్‌ పిక్చర్‌ ఎఫెక్ట్‌ కూడా ఉంది. అంటే చిన్న చిన్న విండోస్‌ రూపంలో చాలా చిత్రాలను ఒకేసారి చూసే అవకాశం ఉంది. ఈ విమానాలతో పాటు ప్రయాణంచే డ్రోన్లు, ట్యాంకర్‌ విమానాలు, సహాయ విమానాల్లోని కెమేరాల నుంచి వచ్చే చిత్రాలను కూడా చూసే అవకాశం లభిస్తుంది. 


ఈ ఎఫ్-35 హెల్మెట్ ను లాక్హీడ్ మార్టిన్ ఫైటర్ జెట్ యొక్క పైలట్ ధరించాడు. అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ ఎ.వాల్ష్‌-III మాట్లాడుతూ ‘ఎఫ్‌-35 హెల్మెట్‌ కేవలం హెల్మెట్‌ కాదు అంతకు మించి' అని చెప్పారు. నిజంగానే ఇది హెల్మెట్ కాదు అంతకుమించి.


మరింత సమాచారం తెలుసుకోండి: