జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లన్స్ తీసుకొచ్చి అందరిని సంతోష పెడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. 

 

దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులను ఫ్రీ ఆఫర్స్ అంటూ సంపాదించుకున్న జియో సంస్ద షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రత్యర్థి కంపెనీలు వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌టెల్‌లు మొబైల్ చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో జియో కూడా ఈ విషయంపై స్పందించింది. 

 

జియో సంస్ద కూడా మరికొన్ని వారాల్లో టారిఫ్ ధరలను పెంచబోతున్నట్టు పేర్కొంది. డిసెంబరు 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ప్రకటించి 24 గంటలు సమయం కూడా అవ్వకముందే జియో ఈ ప్రకటన విడుదల చెయ్యడం ఆశ్చర్యకరంగా ఉంది. 

 

కాగా, నెల రోజుల ముందే జియో నాన్-జియో కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసల చొప్పున వసూలు చేస్తోంది. అయితే నెలకే ఇప్పుడు మొబైల్ చార్జీలు కూడా పెంచితే వినియోగదారులకు ఇబ్బంది అవుతుంది. ఇతర ఆపరేటర్లలానే తాము కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని జియో ప్రకటించింది. 

 

వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు, పరిశ్రమను బలోపేతం చేసేందుకు ట్రాయ్ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటామని, డేటా వినియోగం, డిజిటలైజేషన్‌కు ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా మరికొన్ని వారాల్లో వారు కూడా టారిఫ్‌ను పెంచుతామని ముకేశ్ అంబానీ సంస్థ తెలిపింది.

 

మరి ఈ చార్జీల బాదుడుకు ఇప్పటికే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మళ్ళి అన్ని సంస్దలు కలిసి ఏకంగా ఛార్జీలు పెంచడంపై వినియోగదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అతి తక్కువ అతి తక్కువ అని చెప్పి.. ఇప్పుడేంటి కేవలం రెండు నెలలలోనే ఇన్ని చార్జీలు పెంచుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తమ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: