ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు గూగుల్ కూడా ఒక భాగము అయిపోయింది. అంతే కాకుండా మనకు ఏ విషయంలో సందేహం వచ్చినా మనం ఆశ్రయించేది గూగుల్ నే కదా. మీ ఫోన్ లో ఉండే గూగుల్ యాప్స్ ద్వారానే మీ బ్యాంకు ఖాతాను వీరు క్షణాల్లో జమ చేసుకుంటారు. ఆన్ లైన్ సెక్యూరిటీ సంస్థ అయిన కాస్ పెర్ స్కీ ఏయే గూగుల్ యాప్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అనే అంశంపై ఓ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్న  గూగుల్ యాప్స్, వాటి ద్వారా వారు మోసం చేసే విధానలు  ఇవే...

 


ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు  గూగుల్ క్యాలెండర్ సుపరిచితమే. మన ఫోన్లలో ఉండే సాధారణ క్యాలెండర్ స్థానాన్ని గూగుల్ క్యాలెండర్ ఆక్రమించి ఇప్పటికి చాలా కాలం నుంచే ఉంది . ఇటువంటి మోసగాళ్లు మీ క్యాలెండర్ కు మోసపూరితమైన ఇన్విటేషన్లు పంపడం జరుగుతుంది. కొన్నిసార్లు మనం చెల్లించాల్సిన నగదుకు సంబంధించి రిమైండర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఆ రిమైండర్ రాగానే వెంటనే ఆ చెల్లింపు జరుపుతాం. దీన్నే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచు కోవడం జరుగుతుంది.

 


గూగుల్ ఫొటోస్ కూడా మన అందరికి బాగా తెలుసు. మన ఫొటోలు అందులోనే షేర్ చేసుకుంటు ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో గూగుల్ ఫొటోస్ నుంచి కొందరికి మెయిల్స్ వస్తున్నాయి. ఆ ఫొటోల కింద నగదు చెల్లించాల్సిందిగా కోరుతూ కామెంట్లు ఉంటాయి. తెలియక డబ్బులు చెల్లిస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే! కాబట్టి ఇలాంటి మెయిల్స్ విషయంలో, గూగుల్ ఫొటోస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: