మీరు ఎయిర్‌టెల్ కస్టమరా? అయితే మీకు శుభవార్త. భారతీ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు బంపరాఫర్ అందిస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి పలు సర్వీసులను తన బ్రాడ్‌బాండ్ ప్లాన్లలో భాగంగా కస్టమర్లకు అఫర్ చేస్తోంది. మరో అదిరిపోయే ఆఫర్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. అదేమంటే ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా ఫాస్టాగ్‌ కొనుగోలుపై రూ.50 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ ద్వారా కొనుగోలు చేస్తేనే  వర్తిస్తుంది.

 

 

అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్స్ కొనుగోలు చేయడం వల్ల అదనంగా రూ.50 క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందొచ్చు. ఇకపోతే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కస్టమర్లు బ్యాంక్ నుంచి రూ.50 క్యాష్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చని ఈ కంపెనీ తెలిపింది.  దీని కోసం ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ (హెచ్‌ఎంసీఎల్)‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

 

 

ఇందులో భాగంగా తన డిజిటల్ అండ్ రిటైల్ టచ్‌పాయింట్స్‌లో ఫాస్టాగ్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. లేదంటే యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే  ఫాస్టాగ్ సేవలు అందించేందుకు ఎన్‌పీసీఐ‌తో జతకట్టడం సంతోషంగా ఉందని, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) గణేశ్ అనంత నారాయణ్ తెలిపారు.

 

 

అంతే కాకుండా క్యాష్‌లెస్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదేకాకుండా త్వరలో డిజిటల్ పార్కింగ్ పేమెంట్స్, చలానా పేమెంట్స్ వంటి సేవలను కూడా కస్టమర్లకు అందిస్తామని పేర్కొన్నారు.

 

 

ఇక ఇప్పటికే మోదీ ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్స్ తప్పనిసరి అనే ఉత్తర్వులు జారీ చేసింది.. ఇకనుండి  టోల్ ప్లాజాల వద్ద చార్జీల చెల్లింపు కోసం క్యాష్ తీసుకోరు. ఫాస్టాగ్స్ ద్వారానే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతుంది. అందువల్ల జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్స్ తప్పనిసరిగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: