ప్రస్తుత డిజిటల్ కాలంలో సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేకుండా మన జీవితాన్ని ఊహించడం అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనుషులతో కంటే కూడా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులతోనే మన జీవితం ఎక్కువగా గడపవలసి వస్తోంది అనేది మనలోని ప్రతి ఒక్కరం ఒప్పుకుని తీరవలసిన విషయం. ఇక ఇంటర్నెట్ వినియోగం కూడా అంతకంతకూ పెరగడం, దానితో పాటు సెల్ ఫోన్స్ అత్యల్ప ధరలకు అందుబాటులోకి రావడంతో మనలో చాలా మంది ఇంటర్నెట్ వాడకాన్ని తప్పనిసరి పనిగా మార్చుకున్నారు. అదీకాక నేడు ప్రతి ఒక్క చిన్న సంస్థ కూడా తమ కార్యకలాపాలను కంప్యూటర్ ఆధారంగానే నిర్వర్తిస్తుండడంతో ఇంటర్నెట్ వినియోగం అమాంతం పెరిగింది. ఇక మన డైలీ ఇంటర్నెట్ వాడకంలో ప్రధమంగా మనం ఏదైనా వెతకడానికి వాడేది గూగుల్ సెర్చ్ ఇంజిన్. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు వాడే ఈ సెర్చ్ ఇంజిన్ కనుక కేవలం కొన్ని క్షణాలు ఆగితే జరిగే విధ్వంసం కనుక తెలిస్తే మనకు ఒక్కసారిగా షాక్ కొట్టక మానదు. 
 
 
అయితే 2009 మే నెలలో ఒక రోజు గూగుల్ సడన్ గా మూడు నిమిషాల పాటు పని చేయలేదు, దానితో దాదాపుగా ప్రపంచంలోని నెట్ వినియోగదారులు తమ ఇంటర్నెట్ పనిచేయడం లేదేమో అని ఎంతో ఆందోళన చెందుతూ రాకరకాలుగా ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. కాగా ఆ మూడు నిమిషాల్లో దాదాపుగా ఇంటర్నెట్ ట్రాఫిక్ 20% శాతానికి పైగా షట్ డౌన్ అవడంతో పాటు దానివలన ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఇక దాని తరువాత మళ్ళి 2013 ఆగష్టులో ఇటువంటి పరిణామమే జరిగి గూగుల్, ఈసారి కూడా మూడు నిముషాలు నిలిచిపోయింది. అయితే ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ట్రాఫిక్ దాదాపుగా 40% కి పైగా నిలిచిపోయి, ఎన్నో కార్యకలాపాలు ఆగిపోవడంతో పాటు, సర్వర్లు పనిచేయక వినియోగదారులకు తీవ్రమైన సమస్య తీసుకువచ్చింది. 
 
 
అయితే ఈ రెండు సందర్భాల్లోనూ గూగుల్ సంస్థ నిర్వాహకులు క్షణాల్లో సమస్యను గుర్తించి దానిని నివృత్తి చేయగలిగారు. ఒకవేళ ఇటువంటి పరిణామం కనుక ప్రస్తుత పరిస్థితుల్లో జరిగితే, ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వెబ్ సైట్ లు మరియు సెర్చ్ సర్వర్ల కార్యకలాపాలు ఆగిపోవడం మాత్రమే కాక క్షణాల్లోనే లక్షల కొద్దీ బ్లాగ్ లు, అలానే సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి వాటిలో నెగటివ్ న్యూస్ ప్రచారం కావడంతో పాటు, కోట్లాది ఫేక్ న్యూస్ సృష్టించడం, తత్ఫలితంగా మిలియన్ల కొద్దీ ప్రజల అభిప్రాయాల మధ్య, అసలు ఏమి జరిగిందో ఏమిటో ఎవరికీ అర్ధంకాక దాదాపుగా గూగుల్ ఇంటర్నెట్ కార్యకలాపాలు చాలా వరకు మూతపడే పరిస్థితి వచ్చినా రావచ్చని అంటున్నారు టెక్ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: