నకిలీ సర్వీస్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఈస్జ్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆర్మీ ఇంటెలిజెన్స్ సహకారంతో అరెస్ట్ చేశారు. వీరు సీఆర్‌పీఎఫ్, ఆర్మీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ను తాయారు చేస్తున్నారని తెలిపారు. కాగా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి కథనం ప్రకారం.. 

రసూల్‌పురాకు చెందన కె.నరేశ్ లోన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ కార్ఖానకు చెందిన చంద్రశేఖర్ స్థానికంగా స్మైల్ స్టోన్ సైబర్ కేఫ్ పేరుతో ఇంటర్‌నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం నరేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో.. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా వివిధ యూనిట్లలో పనిచేసే సీఆర్‌పీఎఫ్, ఆర్మీ ఉద్యోగులకు హైదరాబాద్‌లో లోన్లు ఇప్పిస్తానంటూ, అవసరమైన వారి వద్దకు వెళ్లి అందు కు కావాల్సిన సర్టిఫికెట్లను తీసుకునేవాడు.


హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు సర్వీస్ సర్టిఫికెట్ తప్పని సరిగా లోన్ ఫారాల్లో జతచేయాలంటూ వారికి సూచించేవాడు. అయితే తాము సర్వీస్ సర్టిఫికెట్‌ను మీకు అందజేస్తామని, అందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందంటూ చెప్పేవాడు. బో యిగూడకు చెందిన జె.ప్రవీణ్‌కుమార్ తయారు చేసిన సీఆర్‌పీఎఫ్ కమాండింగ్ ఆఫీసర్స్ ఇతర కార్యాలయాలు, అధికారులకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్ లు, చంద్రశేఖర్ ఇంటర్‌నెట్ కేఫ్‌లో తయారు చేసిన సర్వీస్ సర్టిఫికెట్లతో నకిలీ సర్టిఫికెట్లను తయా రు చేస్తున్నారు.

 సీఆర్‌పీఎఫ్, ఆర్మీ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి.. నకిలీ సర్వీసింగ్ సర్టిఫికెట్లను తయారు చేస్తూ ఆయా బ్యాంకులకు దరఖాస్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈస్జ్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మిలటరీ ఇంటెలిజెన్స్ సహాయంతో నరేశ్, చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి, నకిలీ రబ్బర్ స్టాంప్‌లు, నకిలీ సర్టిఫికెట్లు, కంప్యూటర్, రెండు సెల్‌ఫోన్లు, రూ. 44 వేల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ స్టాంప్‌లు తయారు చేసి ఇచ్చిన ప్రవీణ్‌కుమార్ కోసం గాలిస్తున్నారు. ఈ కేసు తదుపరి విచారణను కార్ఖాన పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: