దేశ సరిహద్దు భద్రతను ఉపగ్రహ నిఘా వ్యవస్థతో మరింత కట్టుదిట్టం చేసే క్రమంలో మరో ప్రయోగానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది.  ఇందులో భాగంగా ఇస్రో మూడు నిఘా ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. ఈ క్రమంలో  అంతరిక్షంలోకి ఈ నెల 27న పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ను, దీని ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

 

 

ఇందులో భాగంగా మంగళగవారం ఉదయం మొదలైన కౌంట్‌డౌన్.. 26 గంటలపాటూ కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి రాకెట్ దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ 14 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. అంతే కాకుండా కార్టోశాట్-3తో పాటూ అమెరికాకు చెందిన ఉపగ్రహాలను.. పీఎస్‌ఎల్వీ-సీ47 నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించిన కార్టోశాట్-3 జీవిత కాలం ఐదేళ్లు కాగా ఈ ఉపగ్రహం బరువు 1625 కిలోలు ఉండగా రూ.350కోట్ల ఖర్చు ఉపగ్రహం తయారీకి అయ్యింది.

 

 

ఇకపోతే ఇటు పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో.. ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక శ్రీహరి కోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ఉపగ్రహాలను ప్రయోగం జరుపనున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ  భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది.

 

 

ఐదేళ్ల పాటు అంతరిక్షం నుంచి సేవలు అందించే కార్బోషాట్-3 రెండు వేల వాట్ల సామర్ధ్యం కలిగి ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగం తర్వాత మరో రెండు ఉపగ్రహాలను షార్ నుంచి డిసెంబర్ లో ప్రయోగించే అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు..

 

 

మరో విషయం ఏంటంటే పీఎస్‌ఎల్‌వీ-సీ47 ద్వారా ప్రయోగించే ఈ ఉపగ్రహాన్ని భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో, 97.5 డిగ్రీల కోణంలో ఉంచేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే నవంబరు 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సూర్యుని స్థిర కక్ష్యలోకి పంపుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: