ప్రస్తుత కాలంలో  సెల్‌ ఫోన్‌ వాడకం సంఖ్య భారీగా  పెరిగిపోయింది. చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వారి వరుకు ప్రతి ఒక్కరు సెల్‌ఫోన్‌ వాడుతున్నారు ప్రస్తుతం. ఇలా  సెల్‌ఫోన్‌ ఉపయోగించడం వల్ల  మెదడుపై, శరీరభాగాలపై చెడు ప్రభావం బాగా పెరుగుతుంది అనే  అంశంపై భిన్నాభిప్రాయాలు చాల చోటు చేసుకున్నాయి. ఇక సెల్‌ఫోన్‌ కారణంగా మన దేహంపై పడే దుష్ప్రభావాలపై  చాలా పరిశోధనలు కొనసాగుతున్నాయి అంటే నమ్మండి. ఆ దుష్ప్రభావాలు ఎక్కువ అన్న విషయం స్పష్టంగా ఇంకా తేలకపోయినా... దీని నుంచి రేడియేషన్‌ వస్తుంది.

 

Image result for using of cell

 

ఇలా  రేడియేషన్‌ రావడంతో మనకు ప్రమాదమే అన్న విషయం కూడా అందరికి  తెలిసిందే కదా. అందుకే సెల్‌ఫోన్‌ వాడటం తప్పనిసరిగా చేటు చేస్తుందా లేదా అన్నది  పక్కన పెడితే... కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం చాల అవసరం అని నిపుణులు వెల్లడిస్తున్నారు. మారి  జాగ్రత్తలు ఏమి అని తెలుసుకుందామా మారి...మీ మొబైల్‌ఫోన్‌ మీ శరీరానికి వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోండి. వీలైతే స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడండి చాల మంచిది.

 

Image result for using of cell

 

ఇక పురుషులు అయితే సెల్‌ఫోన్‌ను షర్ట్‌ జేబులో గుండె దగ్గర, మన ప్రైవేట్‌ పార్ట్స్‌కు దగ్గరగా పెట్టుకోకుండా ప్యాంట్‌ పాకెట్స్‌లో ఉంచడం చాల మంచిది. ఇక వీలైతే బ్రీఫ్‌కేసులు, హ్యాండ్‌బ్యాగులలో ఉంచడం ఇంకా బెటర్‌.  వీలైనంత వరకు సెల్‌ఫోన్‌ను ఉపయోగించకుండానే పనులు జరిగేలా చూసుకోవడం మంచిది. పన్నెండేళ్ల లోపు పిల్లలను దీని నుంచి తప్పనిసరిగా దూరంగా పెట్టండి . అదనపు ఫీచర్లు ఉన్న సెల్‌ఫోన్‌లను పిల్లలు విపరీతంగా ఉపయోగిస్తుంటారు. పిల్లలకు గేమ్స్‌ ఆడటానికి కూడా సెల్‌ఫోన్‌ ఇవ్వడకుండా చూసుకోండి. మీరు చాల సేపు సంభాషణను కొనసాగించాల్సి వస్తే.. తప్పనిసరిగా ల్యాండ్‌లైన్‌నే ఉపయోగించడం చాలా మంచిది. ఇక సెల్‌ఫోన్‌లోనే ఎక్కువ సేపు కాల్‌ చేయాల్సి వస్తే తరచు ఫోన్‌ని కుడి చెవికి, ఎడమ చెవికి మారుస్తూ ఉండండి రేడియేషన్ బారి నుండి ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: