స్మార్ట్ ఫోన్లలో డిజిటల్ లావాదేవీల కొరకు ఎక్కువమంది ఉపయోగించే యాప్ గూగుల్ పే. గూగుల్ పే యాప్ ఉపయోగించే కస్టమర్లు స్క్రాచ్ కార్డు ద్వారా 500 రూపాయల నుండి 5000 రూపాయల వరకు పొందండి అని గత రెండు రోజులుగా ఒక ఫేక్ పోస్ట్ వాట్సాప్, ఫేస్ బుక్ లో వైరల్ అవుతోంది. చాలా అందంగా డిజైన్ చేసి లింక్ ను కూడా యాడ్ చేసి కొందరు సోషల్ మీడియాలో లింక్ షేర్ చేశారు. 
 
గూగుల్ పే కస్టమర్లు స్క్రాచ్ కార్డు కోసం ఆశ పడి లింక్ క్లిక్ చేస్తే మాత్రం ఫోన్ కు సంబంధించిన సమాచారం అంతా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. హ్యాకర్లు వైరస్ ను ఈ లింక్ ద్వారా ఫోన్లలో, కంప్యూటర్లలో చేరే విధంగా చేసి ఫోటోస్, కాంటాక్ట్స్, పాస్ వర్డ్స్ ను హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లింక్ క్లిక్ చేసిన వారి గూగుల్ పే అకౌంట్ లోని బ్యాంకు ఖాతాల వివరాలు, పిన్ వివరాలు కూడా ఈ లింక్ ద్వారా హ్యాక్ అవుతున్నట్లు సమాచారం. 
 
ఈ లింక్ క్లిక్ చేసిన వారిలో కొంతమందికి పేమెంట్ రిక్వెస్టులు వస్తున్నట్లు తెలుస్తోంది. పొరపాటున పేమెంట్ రిక్వెస్టును క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలలోని డబ్బులు మాయమవుతాయి. గూగుల్ పే ఏవైనా ప్రమోషనల్ ఆఫర్లను పెడితే గూగుల్ పే యాప్ లో ఆఫర్స్ లో ఆ వివరాలను అందుబాటులో ఉంచుతుంది. కానీ ఇలా లింక్ క్లిక్ చేస్తే స్క్రాచ్ కార్డులు వస్తాయని గూగుల్ పే ఆఫర్లను ప్రవేశపెట్టదు. 
 
గూగుల్ పే స్క్రాచ్ కార్డుల ద్వారా ఒక రూపాయి నుండి లక్ష రూపాయల వరకు ఆఫర్లను బట్టి గెలుచుకునే సౌలభ్యం ఉంది. స్క్రాఛ్ కార్డులో గెలుచుకున్న డబ్బులు నేరులో బ్యాంకు ఖాతాలో జమవుతాయి కాబట్టి చాలామంది గూగుల్ పే ను ఉపయోగిస్తున్నారు. కోట్ల సంఖ్యలో ఉన్న గూగుల్ పే కస్టమర్లను టార్గెట్ చేసుకొని గూగుల్ పే ఆఫర్ ను పోలిన లింక్ ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా కస్టమర్లు విలువైన డేటాతో పాటు బ్యాంకు ఖాతాలలోని డబ్బులను కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: