సుబ్రమణియన్‌, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక సాధారణ మెకానికల్ ఇంజీనిర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. ఇంతకు అంతలా అతను ఏం చేసాడు? అనుకుంటున్నారా?. జాడ లేకుండా పోయిన విక్రమ్ లాండర్ ఆచూకీని మనోడు కనిపెట్టేసాడు. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఈ ఏడాది జులై 22 న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రునిపై పరిశోధనకు గానూ విక్రమ్ ల్యాండర్ ను పంపింది.

 

సుమారు రెండు నెలల ప్రయాణం అనంతరం, సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగాల్సి ఉంది. సెప్టెంబర్ 7న ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి వచ్చారు. అయితే చివరి నిమిషంలో చంద్రుడిపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలియకుండా పోయింది. ఇక అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం ఇటు భారతదేశం అటు అమెరికా గాలిస్తున్నాయి.

 

ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన 33 ఏళ్ళ సుబ్రమణియన్‌, విక్రమ్ ల్యాండర్ ఆచూకీని నాసా తీసిన ఛాయా చిత్రాల ఆధారంగా కనిపెట్టేసాడు. సెప్టెంబర్ 17, అక్టోబర్‌ 14, 15, నవంబర్ 11 తేదీల్లో నాసా తీసిన ఛాయా చిత్రాలను విశ్లేషించి విక్రమ్ ల్యాండర్ ఆచూకీని మనోడు కేవలం 30 గంటల్లోనే కనిపెట్టేసాడు, కేవలం 2 కంప్యూటర్లతో సుబ్రమణియన్ ఈ ఘనతను సాధించడం విశేషం. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా "విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికింది. విక్రమ్‌ ల్యాండర్‌ ముందుగా నిర్ణయించిన సాఫ్ట్‌ల్యాండింగ్‌ ప్రాంతం నుంచి ఆగ్నేయంగా సుమారు 2,500 అడుగుల దూరంలో శకలాలు గుర్తించాం. ఈ ఘనత పూర్తిగా మాది కాదు, చెన్నై ఇంజనీర్ షణ్ముగ సుబ్రమణియన్‌ సాయపడటంతో విక్రమ్‌ పడిన ప్రాంతాన్ని గుర్తించాం" అని నాసా మంగళవారం (డిసెంబర్ 3) న ట్వీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: