ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ కంపెనీలు అన్ని కూడా  ఫాస్ట్ చార్జింగ్ పైనే దృష్టి పెట్టాయి అని బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకు అంటే ఫోన్ లో ఛార్జింగ్ లేకపోతే చాలా కష్టం . మళ్లీ ఫోన్ చార్జింగ్ అయ్యేంతవరకు ఎదురు చూడడం కూడా చాలా కష్టం. ప్రస్తుతం ప్రపంచంలోనే ఫోన్ లోనే అన్ని విషయాలు అన్ని పనులు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని వి స్మార్ట్ ఫోన్ కంపెనీలు అన్నీ కూడా గ్రహించడం జరిగింది. తాజాగా  రియల్ మీ విడుదల చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఎక్స్2 ప్రోతో 50W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇక ఈ ఫోన్లో ఈ టెక్నాలజీ వాడడంతో మీ ఫోన్  5 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది అని సంస్థ తెలియజేస్తుంది.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SMART PHONE' target='_blank' title='phone-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>phone</a> charging

 

ఇదే నేపథ్యంలో ఒప్పో కూడా తన రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ తో 65W ఫాస్ట్ చార్జింగ్ ను మార్కెట్లోకి తీసుకొని రావడం జరిగింది. తాజాగా  రెడ్ మీ జరిగిన ఓ సదస్సులో 100W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని  కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 17 నిమిషాల్లోనే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది అని సంస్థ వెల్లడిస్తుంది. వివో కూడా 120W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీపై చాల కాలం నుంచి  కసరత్తు చేయడం మొదలు పెట్టింది. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SMART PHONE' target='_blank' title='phone-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>phone</a> charging

 

కానీ ఒకే నిమిషంలో మీ ఫోన్ 0 నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కితే? అవును. మీరు విన్నది  నిజమే..! కేవలం ఒక్క నిమిషంలోనే మీ స్మార్ట్ ఫోన్ కు 80 శాతం చార్జింగ్ ను అందించే టెక్నాలజీపై చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వివరాలు చైనా మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ హువాంగ్ యున్ హుయ్ ఈ టెక్నాలజీపై ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీని పెకింగ్ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ అల్యూమ్నీ ఫోరంలో కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ టెక్నాలజీ మొట్టమొదట ఏ కంపెనీకి అందుబాటులోకి వస్తుందనే విషయం మిస్టరీగానే మిగిలి పోయంది.

 

అయితే ఈ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని మాత్రం ఇంకా వివరాలు బయటికి రావడం లేదు. ఒక వేళ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఇదే అవుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ టెక్నాలజీని వేగంగా అమల్లోకి తీసుకొని వస్తాము అని  పరిశోధకులు  తెలియ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: