ఈరోజుల్లో వాహనదారులకు అత్యంత పెను భారంగా ఉన్నది ఏదైనా ఉందటే అది పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదలే. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే వాహనాల సంఖ్య కూడా పెరగడంతో పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా పెరిగిపోతుంది. దీంతో మార్కెట్లో కల్తీ పెరిగిపోతుంది. దీని వల్ల వాహనదారుల జేబులకు చిల్లు పడటంతో పాటు, వాహనాల ఇంజిన్స్ కూడా త్వరగా పాడైపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలుగు శాస్త్రవేత్త సుందరరామయ్య సరికొత్త ఆలోచన చేశాడు.

 

వాహనాలని పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ లకు ప్రత్యామ్నాయంగా మంచినీరుతో నడిచే వాహనాన్ని తయారు చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడువు 16 ఏళ్లుగా కష్టపడుతూ ఈ గుంటూరుకు చెందిన శాస్త్రవేత్త...చివరకు నీటితో నడిచే వాహనాన్ని తయారు చేశారు. అయితే ఇందులో 80 శాతం నీరు ఉంటే, 20 శాతం ఇంధనం ఉండనుంది. అయితే నీరు నుంచి హైడ్రోజన్ సెపరేట్ చేసి, దాని ద్వారా ఇంజిన్ పనిచేసే ఆలోచన చేశారు. వాటర్ హెడ్రోలసిస్ థెరఫీ ద్వారా హెడ్రోజన్ తయారవుతుంది.

 

అలా తయారు అయిన హైడ్రోజన్.. ఇంజన్ లోకి వెళ్లీ కంప్రెస్ అవుతుంది. ఇక ఇది ఇంజన్ నడవడానికి ఈ హెడ్రోజన్ ఉపయోగపడుతుంది. ఇలా తయారైన ఇంధనం ఒక లీటరు...సాధారణ ఫ్యూయల్ 30 లీటర్లకు సమానం. ఈ నీటి ఇంధనం వల్ల వాహనాలకు ఎక్కువ మైలేజ్ కూడా వస్తుంది. అలాగే దీనివల్ల కాలుష్యం ఉండదు. అయితే నీటితో నడిచే ఇంజిన్లని వాహనాలకు అమర్చాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని తెలుస్తోంది. 

 

ఇలాంటి పరికరాలని పెట్టాలంటే దాదాపు 3 నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందట. అయితే నీటి నుంచి హైడ్రోజన్ ని వేరు చేసే ప్రక్రియ చాలా ప్రమాదకరమని, మరో ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో నడిచే కారుని రూపొందిస్తామని సుందరరామయ్య చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: