విక్రమ్‌ ల్యాండర్‌ని నాసా కనిపెట్టిందా..? లేక ఇస్రో కనిపెట్టిందా..? ఇప్పుడు ఈ విషయంపై ఇస్రో చీఫ్‌ చేసిన ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారింది. మేమే కనిపెట్టమని నాసా చేసిన ప్రకటనను ఇస్రో చీఫ్‌ శివన్‌ తోసిపుచ్చారు. విక్రమ్‌ ఆచూకీ కనుగొన్నది నాసా కాదని.. దాని జాడని ఎప్పుడో గుర్తించామని ప్రకటించింది ఇస్రో.

 

చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్‌ గల్లతైంది. ఈ ల్యాండర్‌ జాడలను కనిపెట్టామంటూ నాసా వెల్లడించింది. అయితే నాసా ప్రకటనను వ్యతిరేకించారు ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌. చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌ ఆ పని ఇంతకుముందే చేసిందని ఆయన తెలిపారు. విక్రమ్‌ ల్యాండర్‌ జాడను ఆర్బిటర్‌ ఎప్పుడో కనిపెట్టిందని తేల్చారు శివన్‌. ఈ విషయాన్ని తాము ఎప్పుడో ప్రకటించామని.. కావాలంటే ఒకసారి చెక్‌ చేసుకోండని అసహనం వ్యక్తం చేశారు శివన్‌

 

ఈ ఏడాది జూలై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-2 ను ప్రయోగించారు. నెలల ప్రయాణం తర్వాత సెప్టెంబర్‌లో జాబిల్లి కక్ష్యలోకి చేరింది చంద్రయాన్‌-2. విక్రమ్‌ ల్యాండర్‌ వేరుపడి నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణించింది. అయితే చివరిక్షణంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ బదులు కొంత ఎత్తు నుంచి కుప్ప కులిపోయినట్లు నాసా నిర్ధారించింది. విక్రమ్‌ కూలిపోయిన కొద్ది రోజులకు నాసా కొన్ని ఛాయాచిత్రాలను విడుదల చేసింది. ఈ ఫోటోలతో చెన్నై మెకానికల్‌ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ తన ప్రయత్నం చేశారు. షణ్ముగ సహాయంతో ల్యాండర్‌ని గుర్తించామని నాసా వెల్లడించింది. దీంతో ఇప్పుడు ఈ ప్రకటనను వ్యతిరేకించారు శివన్‌. నాసా కంటే ముందే విక్రమ్‌ ల్యాండర్‌ను తాము గుర్తించామని ఇస్రో అప్పుట్లో ప్రకటించింది. అయితే విక్రమ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్నది మాత్రం ఇస్రో స్పష్టంగా చెప్పలేదు. విక్రమ్‌ ల్యాండర్‌ని నాసా కనిపెట్టిందా..? లేక ఇస్రో కనిపెట్టిందా..? ఇప్పుడు ఈ విషయంపై ఇస్రో చీఫ్‌ చేసిన ప్రకటన హాట్‌ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: