సూర్యుడి ఉపరితలం కంటే కరోనా ఉష్ణోగ్రత వందల రెట్లు ఎక్కువ ఎందుకుంది? ఆదిత్యుడి నుంచి వెలువడే గాలులకు మూలమెక్కడ? ఇలాంటివి ఇప్పటికీ మిస్టరీలే. అయితే  నాసా ప్రయోగించిన పార్కర్‌ ప్రోబ్‌ పంపిన సమాచారంతో ఈ రహస్యాలను చేధించడానికి రెడీ అయింది నాసా.

 

నక్షత్రాల పుట్టుక.. వాటి పరిణామ క్రమం.. అవి అంతమయ్యే క్రమం.. వీటి గురించి మనకు తెలిసింది గోరంతే. తెలుసుకోవాల్సింది కొండంత. ఆ వివరాలు తెలుసుకునేందుకు నాసా పంపిన పార్కర్‌ వ్యోమనౌక.. ఊహించినదానికన్నా అద్భుతంగా పనిచేస్తోంది. ఆ శాటిలైట్‌ పంపిన డేటాను చూసి శాస్త్రవేత్తలు సైతం ముక్కున వేలుసుకుంటున్నారు.  ఆ సమాచారంతో నక్షత్రాల పుట్టుక, వాటి జీవితం, ఆదిత్యుడిపైన వాతావరణ పరిస్ధితుల గురించి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు నాసా సైంటిస్ట్‌లు.

 

సూర్యుడి అయస్కాంత క్షేత్రాలు అనూహ్యంగా తల్లకిందులవుతున్నాయని పార్కర్‌ పంపిన సమాచారం ఆధారంగా వారు గుర్తించారు. ఈ పరిణామాన్ని వారు స్విచ్‌బ్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. స్విచ్‌బ్యాక్స్‌కు కారణమేంటో ఇంకా మిస్టరీగానే ఉంది . సూర్యుడి శక్తి సౌరవ్యవస్థ అంచుల దాకా ఎలా ప్రసరిస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ పరిణామం ఉపయోగపడే ఛాన్స్‌ ఉందని నాసా అభిప్రాయపడుతోంది.

 

సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌..  35 లక్షల మైళ్ల వ్యాసంలో విస్తరించి ఉన్న ధూళికణాలను ఆవిరి చేస్తాయని పార్కర్‌ ద్వారా తెలుసుకున్నారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే సౌరగాలుల వేగం.. ప్రామాణిక నమూనాల ఆధారంగా ఇన్నాళ్లూ శాస్త్రజ్ఞులు ఊహించినదాని కన్నా పదిరెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. నిజానికి.. సౌరగాలులు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుండగా వాటిని విశ్లేషించడం ఇదే మొదటిసారి. ఇది పార్కర్‌ సాధించిన మరో ఘనత. . ఈ రాకెట్‌ని 2018 ఆగష్టు 13న నింగిలోకి పంపించింది నాసా.  సూర్యునికి చేరువగా.. పార్కర్ సోలార్ ప్రోబ్ చేరి రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా.. ఒక రాకెట్.. సూర్యుడికి అతి దగ్గరగా చేరడం కూడా ఇదే మొదటిసారి. దీంతో.. నాసా కష్టం దాదాపు ఫలించిందనే చెప్పవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: