టెలికం రంగంలో అడుగు పెడుతూనే జియో సంచలనం సృష్టించింది.. అన్ని ఫ్రీ అంటూ ఆకట్టుకున్నా ఆ సంస్థకే చెందింది.. ఆ తర్వాత టారిప్ ప్లాన్స్ అమలు చేసినా.. ఇతర నెట్‌వర్క్ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేసినా జియోకే చెల్లింది. దేశంలో మరోసారి మొబైల్ కాల్ రేట్ల పోటీకి తెరలేచింది. జియో సహా ప్రధాన టెలికాం ఆపరేటర్లు కాల్ చార్జీలు పెంచేశారు. అందుకు అనుగుణంగా కొత్త ప్లాను తీసుకువచ్చారు. వోడాఫోన్ ఐడియా మరియు ఎయిర్టెల్ ఇప్పటికే తమ దరలవివరాలను ప్రకటించాయి. అలాగే రిలయన్స్ జియో కూడా కొత్త ఆల్ ఇన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్ల పేరుతో వివరాలను ప్రకటించిన విష‌యం తెలిసిందే.

 

అయితే మొబైల్ టారిఫ్‌లను జియో పెంచింది. పైగా, రెండు ప్లాన్లను ఎత్తివేసింది. అయితే, పెంచిన ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అలాగే సామాన్యుల‌కు అందుబాటులో లేవ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దీంతో టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. ఈ మ‌ధ్యే పెంచిన మొబైల్ టారిఫ్‌ల‌కు అనుగుణంగా నూత‌న ప్లాన్ల‌ను లాంచ్ చేసిన జియో అంత‌కు ముందు ఉన్న రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. 

 

ఈ క్ర‌మంలో రూ.98 ప్లాన్‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు 2జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్ వ‌స్తాయి. ఇక ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణ‌యించారు. అలాగే రూ.149 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణ‌యించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: