ఆండ్రాయిడ్ వినియోగదారులకు గూగుల్ తాజా సెక్యూరిటీ బులెటిన్ బ్యాడ్ న్యూస్ ను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ కు సంబంధించిన మూడు భద్రతా లోపాలను ఈ బులెటిన్ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిలో ఉన్నవాటిలో ఒకదాన్ని గూగుల్ అత్యంత తీవ్రమైన ప్రమాదంగా గుర్తించింది. దాని కారణంగా మీ ఫోన్ శాశ్వతంగా పనిచేయకుండా పోయే అవకాశం ఉందని తెలుపుతుంది..

 

 

అసలు అంత ప్రమాదకరమైన లోపాలు ఏంటి? దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకుంటే.. గూగుల్ సెక్యూరిటీ తెలిపిన ప్రకారం ఇందులో మూడు లోపాలు ఉన్నాయట. వాటిలో రెండిటిని క్లిష్టమైన వాటిగా గుర్తించారు. మూడో దాన్ని మాత్రం అత్యంత తీవ్రమైన ప్రమాదంగా గుర్తించారు.  దీనికి CVE-2019-2232 అనే కోడ్ నేమ్ పెట్టారు. అధికారిక NIST డేటాబేస్ ప్రకారం ఈ లోపం కారణంగా మీ ఫోన్ లో ఉన్న అప్లికేషన్లు క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా మీ స్మార్ట్ ఫోన్ brick అయ్యే ప్రమాదం ఉంది. అంటే మీ ఫోన్ ఎప్పటికీ పని చేయదన్న మాట. మీరు ఏ సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి ఎంత రిపేర్ చేయించినా అది తిరిగి పని చేసే అవకాశం అస్సలు లేదని   చేబుతున్నారు..

 

 

ఆండ్రాయిడ్ 8.0, 8.1, ఆండ్రాయిడ్ 9 Pie, ఆండ్రాయిడ్ 10 వెర్షన్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారికి ఇలా జరిగింది. ఆండ్రాయిడ్ వినియోగదారుల్లో ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారే కాబట్టి ఎన్నో స్మార్ట్ ఫోన్లకు ఈ సమస్య తలెత్తే అవకాశం ఉందట..  ఇకపోతే దీనికి సంబంధించిన సెక్యూరిటీ అప్ డేట్ ను గూగుల్ విడుదల చేసింది. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో డిసెంబర్ సెక్యూరిటీ అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా మీ ఫోన్ కు ఈ అప్ డేట్ వచ్చి ఉంటే వెంటనే అప్ డేట్ చేసుకోండి.

 

 

మీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఆండ్రాయిడ్ నుంచి ఏ అప్ డేట్లు వచ్చినా వాటిని వెంటనే ఇన్ స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు అప్ డేట్లలో ఉండే సెక్యూరిటీ లోపాలను గూగుల్ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కొత్త అప్ డేట్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీ ఫోన్ ను రక్షించుకోవాలంటే వెంటనే ఈ కొత్త సెక్యూరీటి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: