ఈ మధ్య కాలములో చాలా వరకు వాస్తవాలు పరిశీలించకుండా, గమనించకుండా బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియాతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు అయిన దేవులపల్లి అమర్‌ గారు హితవు పలికారు. గండేపల్లి మండలోని సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల్లో చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (ఏపీయూడబ్ల్యూజే) సమక్షములో ‘సమాజంలో మార్పు – మీడియా పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు మంగళవారం రోజు  ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అమర్, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నడం జరిగినది.

 

   ఈ సదస్సులో అమర్‌ గారు మాట్లాడుతూ, నేటి సమాజంలో సోషల్‌ మీడియా చాలా ఉన్నత స్థానము సంపాదించుకున్నది అని, విస్తృతమైందన్నారు. ఇటీవలి కాలంలో సమాచారం త్వరితగతిన అందజేయాలనే ఉద్దేశ్యంతో మీడియా విశ్వసనీయతే ప్రమాదంలో పడపోతుదన్నారు. సోషల్‌ మీడియా అసలు మీడియానే కాదన్నారు. పత్రికారంగంలో వేగం మంచిదే కానీ, ఆ తొందరలో అనేక రకమైన పొరపాట్లకు తావీయకూడదని సూచించారు.

 

Devulapalli <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AMAR' target='_blank' title='amar -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>amar </a>Speech In Gokavaram At <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=EAST GODAVARI' target='_blank' title='east godavari-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>east godavari</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DISTRICT' target='_blank' title='district-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>district</a> - Sakshi

 

మీడియాకు సమాజములో సామాజిక బాధ్యత ఉందని, ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశోధించి, వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు, ప్రజల ముందుంచుతుందని చెప్పా రు. ఈ మధ్యకాలంలో చాలా ప్రెస్ పత్రిక కార్యాలయాలు రాష్ట్రంలో చాలా వరకు నిరాదరణకు గురైన ప్రెస్‌ అకాడమీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభు త్వం కృతనిశ్చయంతో ఉంది అని తెలియజేశారు. ప్రస్తుతము ప్రెస్‌ అకాడమీకి ఒక చైర్మన్‌ను నియమించారని, త్వరలో సభ్యులను కూడా నియమించి విధివిధానాలను సిద్ధం చేస్తానమని  చెప్పారు. 

 

   సోషల్ మీడియా క్రమేపీ తన వేగా న్ని పెంచుకుంటూ నేడు జెట్‌ స్పీడుకు చేరిందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేయడము పరిపాటి అయిపోయింది. టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు కూడా అలాగే వస్తున్నాయి. చూపించిందే చూపించడమే జరుగుతున్నది. దీంతో పత్రికల్లో తరువాత రోజు వచ్చిన వార్త సద్ది వార్తలు గా తయారవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పత్రికలు అదే విషయాన్ని కొత్తగా ప్రజెంట్‌ చేయడానికి తెగ పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా ఒక సవాల్ గా తయారైందని అమర్‌ తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: