ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేక స్మార్ట్‌ఫోన్‌లలో కొన్ని వారాలు మాత్రమే పని చేయనుంది. వాట్సాప్ ఎఫ్ఏక్యూ సెషన్ లో తమ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాదానం చెప్తూ "చాలా స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పని చేసే విధంగా లేటెస్ట్ మెకానిజం లేనందున పురాతన ఆండ్రాయిడ్, ఐ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ సేవలను ఫిబ్రవరి 1, 2020 నుంచి నిలిపివేస్తున్నాం" అని వాట్సాప్ పేర్కొంది.

వాట్సాప్ ఎఫ్‌ఎక్యూ తాజా సమాచారం ప్రకారం, ఆండ్రాయిడ్ 2.3.7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఓఎస్ 8 మరియు అంతకు ముందు ఉన్న ఒఎఎస్ తో నడుస్తున్న ఐఫోన్‌లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ తన సేవలను ఉపసంహరించుకోనుంది. ఇక అలాగే "ఫిబ్రవరి 1, 2020 తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త వాట్సాప్ అకౌంట్లు సృష్టించలేరు లేదా ఉన్న అకౌంట్లను ఉపయోగించలేరు" అని స్పష్టం చేసింది. వీటితో పాటు, వాట్సాప్ అన్ని విండోస్ ఫోన్లకు డిసెంబర్ 31, 2019 నుంచి తన సేవలను ఉపసంహరించుకుంటుంది. అంటే జనవరి 1, 2020 నుంచి విండోస్ ఫోన్లలో వాట్సాప్ బంద్ కానుంది.

డిసెంబర్ 31, 2019 తరువాత వాట్సాప్ తన సేవలను విండోస్ ఫోన్లకు అందజేయం అని పేర్కొన్న నేపథ్యంలో మీ వాట్సాప్ చాట్ ను సేవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. మీకు విండోస్ స్మార్ట్‌ఫోన్ ఉంటే, మీ చాట్‌లు మరియు సమాచారాన్ని 31 డిసెంబర్, 2019 న కోల్పోకూడదనుకుంటే మీ చాట్‌లను సేవ్ చేయడానికి కాంటాక్ట్ ఇన్ఫో లేదా గ్రూప్ ఇన్ఫో పై క్లిక్ చేసి చాట్ ఎక్సుపోర్టు ఆప్షన్ ను ఎన్నుకుని మీ చాట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఫేస్‌బుక్ కి చెందిన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్, జియోఫోన్, జియోఫోన్ 2 తో సహా కాయ్ ఒఎస్ 2.5.1+ పై పని చేస్తున్న అన్ని ఫోన్లకు వాట్సాప్ సేవలు అందుతాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్‌లకు వాట్సాప్ సేవలను నిలిపివేసే నిర్ణయం చాలా తక్కువ మంది వినియోగదారులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాట్సాప్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: