కెమెరా ఏంటి, మాట్లాడం ఏంటి? అనుకుంటున్నారా !!! మీరు విన్నది నిజమేనండి... మాట్లాడడమే కాదు లైంగిక పదజాలం తో ఆ చిన్నారికి చుక్కలు చూపించిందంట.. వివరాల్లోకి వెళితే.....

 


భద్రత కోసం మిస్సిస్సిపి లో నివాసం ఉంటున్న ఒక కుటుంబం ఒక కెమెరాని  కొని  ఇంట్లో చిన్నారి గదిలో సెట్ చేసారంట. భద్రత కోసం కొన్న రింగ్ కంపెనీ కి చెందిన కెమెరాలు వాళ్ళకి పీడకలల్ని మిగిల్చాయట.. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన అమెజాన్ కంపెనీ కి చెందిన రింగ్ సెక్యూరిటీ కెమెరాల్లోని లోపాలని బయటపెట్టింది..

 


వాషింగ్ టన్ పోస్ట్ ప్రకారం..ఎనిమిది సంవత్సరాల వయస్సు గల "అలీసా" నిద్రించేందుకు తన గదికి వెళ్ళింది. అక్కడ అనుకోని సంఘటన ఆ పాపని అయోమయం లో పడేసింది.. ఏమి జరుగుతుందో తెలియలేదట. గదిలోకి వెళ్ళగానే ఏవో వింతయిన శబ్దాలు, మ్యూజిక్, మాటలు వినిపించాయట... కాని గది లో ఎవరు లేరంట.. మొదట అలీసా చెల్లెలు తన గదిలోకి చేరి ఆట పట్టిస్తుందేమో అనుకుందట..

 

కాని కొంత సేపటి తర్వాత" ఒక మగ గొంతు వినిపించిందట. హలో... ఎవరయినా ఉన్నారా? ? అని అన్నాడట. అలీసా బయపడి పోయి అంతా చూసింది ఎవరు లేరు.. కాని మగ గోతు వినిపిస్తుందట. ఆ వ్యక్తి జాతి విద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్నాడట.. అలాగే చిన్నారి పై అసభ్యకర పదజాలం వాడాడట.. అంతటితో ఆగకుండా లైంగిక గా వేదించాడట"

 

భయం తో పరుగులు తీసి తన చెల్లెలు ని పిలిచిందట. తాను అందుబాటులో లేదు. వాల్ల నాన్న పని మీద బయటకి వెళ్ళాడట.. కాని అలీసా వల్ల నాన్న కి కూతురు రూమ్ లో ఉన్న కెమెరా హాక్ అయిందన్న విషయం మెసేజ్ వచ్చిందట.. వెంటనే అలెర్ట్ అయ్యి ఇంటికి ఫోన్ చేసి అలీసా ను కెమెరా ప్లగ్ ని తొలగించమని ఫోన్ లో చెప్పారు.. అలీసా కెమెరా ఆఫ్ చేసి రూమ్ నుంచి భయంతో బయటకి వచ్చి జరిగినదంతా వల్ల అమ్మ కి చేపిందట..

 

చిన్న పిల్ల కదా' కెమెరా హాక్'... ఇవేమీ తెలియకపోవడం తో దెయ్యం అని భయపడిపోయింది. కూతుళ్ళ భద్రత కోసం కెమెరాలు పెట్టుకుంటే ఇలాంటి చెడు అనుభవం ఎదురైందని, రింగ్ సెక్యూరిటీ కెమెరాస్ వల్ల ఇలాంటి హకింగ్స్ ఎక్కువ అయ్యాయని విమర్శించారు...

 

కూతురి పై లైగింకముగా వేధించాడని, జాతి, విద్వేషపూరిత పదాలు వాడడని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు. రింగ్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూస్తామని కెమెరా ప్రతినిధులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: