నిన్న మొన్న ఉన్న ఆధార్ కార్డు ఇప్పుడు కనిపించకుండా పోయిందా..? లేదంటే కార్డు చినిగిపోయిందా..? అయితే ఏంటి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కొత్త ఆధార్ కార్డును అటు ఇటు తిరగకుండా సులభంగా పొందొచ్చు. దీని కోసం ఆధార్ సెంటర్‌కు కూడా వెళ్లాల్సిన పని లేదు.


ఆధార్ అనేది ప్రస్తుత కాలంలో కీలకమైన ధ్రువీకరణ పత్రాల్లో ఇది కూడా ఒకటి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. అంతేకాకుండా ఇంకా ఆధార్ కార్డు పలు వాటికి ఐడెంటిఫికేషన్‌ డాక్యుమెంట్‌ గా కూడా పని చేస్తుంది.ఆధార్ కార్డు కొన్ని సందర్భాల్లో కనిపించకుండాపోవచ్చు. అయితే ఇలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డును సులభంగా తిరిగి పొందొచ్చు. ఇంట్లో కూర్చొని పని పూర్తి చేసుకోవచ్చు.


 UIDAI (యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇటీవల ఓ కొత్త ఎం ఆధార్ యాప్‌ ను లాంచ్ చేసింది. దీనిని గూగుల్ ప్లేస్టోర్‌ కు వెళ్లి అక్కడ డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. దీంతో ఎన్నో రకాల సేవలు పొందొచ్చు. కొత్త ఆధార్ కార్డు కూడా తీసుకోవచ్చు. కొత్త "mAadhaar" యాప్‌ తో ఆధార్ కార్డు డౌన్‌ లోడ్, అప్‌డేట్ అడ్రస్, ఆఫ్‌ లైన్ కేవైసీ, వెరిఫై ఆధార్, వెరిఫై ఈమెయిల్, స్కాన్ క్యూఆర్ కోడ్, యూఐడీ/ ఈఐడీ తిరిగి పొందటం, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవడం వంటి చాలా సర్వీసులు పొందొచ్చు. వీటితోపాటు ఆధార్ రిప్రింట్ కోసం కూడా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చట.


ఆధార్ రిప్రింట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకుంటే రూ.50 చెల్లించాల్సి వస్తుంది. వెంటనే కొత్త ఆధార్ కార్డు 15 రోజుల్లోగా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే ఎంఆధార్ యాప్‌ లో ప్రధానంగా ఆధార్ సర్వీసెస్ డ్యాష్‌బోర్డు, మై ఆధార్ అనే రెండు సెక్షన్లు ఉంటాయి. ఈ యాప్ తెలుగు సహా 13 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: