మనలోని చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటారు. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తోంది. ఈ క్రమంలో కేవలం ఇంగ్లీష్ భాషకే కాకుండా ఆయా దేశాల్లోని ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ అసిస్టెంట్‌లో ప్రాంతీయ భాషలకు సదుపాయం కూడా కల్పించింది. ఇక‌ తాజ‌గా టెక్‌ దిగ్గజం గుగూల్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి గూగుల్‌ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్‌ (దుబాసీ) మోడ్‌ అందరికీ  అందుబాటులో రానుంది. 

 

ఈ రియల్‌ టైమ్‌ ట్రాన్సలేషన్‌ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్‌ పనిచేస్తోంది.  విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్‌ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్మార్‌ టెక్నాలజీని అన్ని స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా ఇక ఫీచర్‌ పనిచేస్తుంది. అలాగే ఈ ఫీచర్‌ తెరిచి మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది.

 

ఇక దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే.. స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్‌ అసిస్టెంట్‌ను తెరిచి.. ఇంటర్‌ప్రిటెర్‌ మోడ్‌ను డైరెక్ట్‌గా వాడొచ్చు. అలాగే ‘ఓకే గూగుల్‌ లేదా హే గూగుల్‌’ అనే వాయిస్‌ కమాండ్‌తో గూగుల్‌ అసిస్టెంట్‌ను తెరవచ్చు. లేదా అండ్రాయిడ్‌ ఫోన్లలో పవర్‌ బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా గూగుల్‌ అసిస్టెంట్‌ ఓపెన్‌ అవుతోంది. మీకు ఏ భాష రాకుంటే.. ఆ భాషలో ఇంటర్‌ప్రెటెర్‌ మోడ్‌ను ఓపెన్‌ చేసి సంభాషించడమే. మీకు వచ్చిన భాషలో మాట్లాడితే.. కావాల్సిన భాషలోకి గూగుల్‌ అసిస్టెంట్‌ అనువాదం చేసి ఇస్తుంది. అంతే దీన్ని ఉప‌యోగించ‌డం చాలా సులువు.

మరింత సమాచారం తెలుసుకోండి: