కొన్ని సంవత్సరాలుగా  డేటా గోప్యతా కుంభకోణాలు,  మార్కెట్ వ్యతిరేక పద్ధతులు వంటి  వివాదాలు ఉన్నప్పటికీ, ఫేస్బుక్, దానికి సంబందించిన యాప్ లు ఈ  దశాబ్ద కాలం లో  అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన యాప్ లుగా  అవతరించాయి. ప్రధాన యాప్ లు  అయినా  ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లు  మొదటి నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ  దశాబ్దం లో ఎక్కువగా డౌన్లోడ్ అయినా  జాబితా యొక్క టాప్ 10 స్థానాలలో ఈ నాలుగు యాప్ లు, మొదటి నాలుగు  స్థానాలు దక్కించుకున్నాయి.

 

 

 

 

 

 

 

డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ యాప్  ఐని  ప్రకారం, ఫేస్‌బుక్ మొబైల్ యాప్ లలో  ఆధిపత్యం చెలాయించింది, ఫేస్బుక్, దాని అనుబంధ యాప్ లు ఈ  దశాబ్ద కాలం (2010-2019 ) లో  అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన నాలుగు యాప్ లుగా  అవతరించాయి.    కమ్యూనికేషన్ మరియు సోషల్ మీడియా యాప్ లను  వినియోగదారులు డౌన్లోడ్  చేయడానికి  ఇష్టపడుతున్నారు.  ఈ దశాబ్ద కాలంలో   డౌన్‌లోడ్ల ద్వారా టాప్ 10 యాప్ ల లో  7  స్థానాలను సోషల్ మీడియా యాప్ లు  కలిగి ఉన్నాయి  అని డేటా అనలిటిక్స్ ప్లాట్ఫామ్ యాప్  ఐని  వెల్లడించింది.   ఈ దశాబ్దంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేయబడిన ఇతర యాప్  జాబితాలో స్నాప్‌చాట్ (ఐదవ), స్కైప్ (ఆరవ), టిక్‌టాక్ (ఏడవ), యుసి బ్రౌజర్ (ఎనిమిదవ), యూట్యూబ్ (తొమ్మిదవ) మరియు ట్విట్టర్ (పదవ) స్థాన లలో నిలిచాయి.

 

 

 

 

 

 

 

ఆల్-టైమ్ కన్స్యూమర్   టాప్ 10  వీడియో-స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యాప్ లలో,  నెట్‌ఫ్లిక్స్ చార్టులో అగ్రస్థానంలో ఉంది, తరువాత టిండెర్ మరియు పండోర మ్యూజిక్ ఉన్నాయి.   వినియోగదారుల వ్యూస్  పరంగా టిండెర్ ఈ  దశాబ్దంలో అత్యంత విజయవంతమైన డేటింగ్ యాప్ గా అవతరించినప్పటికీ , ఓవరాల్  ర్యాంకింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ తర్వాత   రెండవ స్థానంలో నిలిచింది  అని నివేదిక తెలిపింది.   సబ్ వే  సర్ఫర్స్ ఈ  దశాబ్దంలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్  గేమ్ గా నిలిచింది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: