ప్రస్తుతం స్మార్ట్ ఫోన్  వాడే ప్రతి ఒక్కరు కూడా  బ్రౌజర్ కోసం  గూగుల్ క్రోమ్ ని ఉపయోగిస్తారు. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో డీఫాల్ట్ గా రావడంతో పాటు వినియోగించేటప్పుడు కూడా స్మూత్ గా ఉండటంతో అందరూ గూగుల్ క్రోమ్ నే వాడుతూ వస్తున్నారు అని బాగా అర్థం అవుతుంది. తాజాగా   గూగుల్ క్రోమ్ ఆండ్రాయిడ్ వెర్షన్ కు క్రోమ్ 79 అప్ డేట్ కూడా రావడం జరిగింది. వచ్చిన అతి కొన్ని రోజులకే ఈ అప్ డేట్ ను నిలిపివేస్తూ గూగుల్ నిర్ణయం  తీసుకోవడం జరిగింది.

 

అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాక కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి డేటాను ఈ వెర్షన్ తుడిచివేస్తుందని కొన్ని ఫిర్యాదులు రావడం జరిగింది. క్రోమ్ లో ఉండే బిల్ట్-ఇన్ ఫ్రేమ్ వర్క్ వల్ల ఈ లోపం వచ్చినట్లు గ్రహించారు. సాధారణంగా మన స్మార్ట్ ఫోన్ లో వెబ్ డేటా స్టోర్ అయ్యే లొకేషన్ అప్ డేట్ అయిన కారణంగా ఈ సమస్య వచ్చినట్లు  క్రోమియం పోస్టులు, ఆండ్రాయిడ్ పోలీస్ పోస్టుల ద్వారా అర్థం అయంది అందుకే ఈ సేవలను రద్దు చేయడం జరిగింది.

 


ఇక  గూగుల్ క్రోమ్ అధికారి ఒకరు దీనికి సంబంధించిన క్రోమ్ 79 అప్ డేట్ ను నిలిపివేసినట్లు క్రోమియం పేజీకి తెలియచేయడం జరిగింది. ప్రస్తుతం  గూగుల్ ఈ సమస్యపైనే  చర్యలు తీసుకుంటుంది అన్ని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన పరిష్కారంతో ముందుకు వస్తామని ఆ ప్రతినిధి అందరికి తెలియచేయడం జరిగింది. 

 

ఇందులో  ముఖ్యంగా గూగుల్ క్రోమ్ రెండు రకాల పరిష్కారాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. వాటి వివరాలు ఇలా.. ప్రస్తుతం ఉన్న ఫైల్స్ ను కొత్త స్థానానికి మార్చడం, లేక ఆ ఫైల్స్ ను ఇంతకుముందు ఉన్న స్థానాలకే తిరిగి ఉంచేలగా చేయడానికి పని చేస్తున్నారు. కాబట్టి మీ ఫోన్ కు ఒకవేళ గూగుల్ క్రోమ్ 79 అప్ డేట్ వస్తే చేసుకో వద్దు అన్ని అధికారులు తెలియచేస్తున్నారు. ఎందుకంటే మీ  డేటాను ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం చాల కష్టం కాబట్టి. అందుకే జాగ్రత్త వహించడం చాల మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: